రాణా నవనీత్ కౌర్ ను పెళ్ళాడబోతున్నాడా...!?
అందాల ఆరబోతకు అడ్డుచెప్పని పంజాబీ నటి, సెక్సీతార నవనీత్ కౌర్. 'శీను వాసంతి లక్ష్మి" చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన నటి నవనీత్‌కౌర్. టాలీవుడ్ అగ్రహీరోలతోనే కాకుండా యూత్ హీరోల సరసన నటించిన నవనీత్ కౌర్ కి ఆతర్వాత ఆమెకు ఆశించినంతగా అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన గుర్తింపు రాలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ పంజాబీ భామ ప్రేమలో పడిందని, అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి.
అవకాశాలు రాకపోవడంతో చేసేదేమీ లేక..ఇక అమ్మడు పెళ్ళి చేసుకొని సెటిలవ్వాలని నిర్ణయించుకుందట. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రవిరాణాను ఈసంవత్సరాంతంలో పెళ్ళి చేసుకోబోతుంద ఫిల్మిం సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇద్దరు ఎక్కడ కలిసారో..ఎలా వీరి మనసులు ఒకటయ్యాయో త్వరలోనే వీళ్ళిద్దరు పెళ్ళి చేసుకోవడానికి సిద్దమౌతున్నారంట.


Click it and Unblock the Notifications











