twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దగ్గుబాటి హీరో డబుల్ ధమాకా.. రెండు చిత్రాల అప్‌డేట్స్

    |

    దగ్గుబాటి హీరో రానా.. వరుస ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. టాలీవుడ్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లంటూ ఫుల్ బిజీగా ఉండే ఈ హీరో.. స్క్రీన్‌పై కనబడి చాలా కాలమే అయింది. రానా ప్రస్తుతం విరాటపర్వం షూటింగ్‌లో ఉన్నాడు. ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి కాబోతోందని తెలుస్తోంది. తాజాగా రానా నటించబోతోన్న రెండు ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వైరల్ అవుతున్నాయి.

    పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా..

    పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా..

    బాహుబలి తెచ్చిపెట్టిన క్రేజ్‌తో రానా వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు మాత్రమే ఓకే చెబుతున్నాడు..పాన్ ఇండియా కేటగిరీలో యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. హాథీ మేరా సాథీ- హిరణ్యకశిప అందులో భాగంగా ఓకే చేసినవే. భారీ బడ్డెట్‌తో తెరకెక్కించి ఈ సినిమాల్ని హిందీ మార్కెట్‌లో కూడా సేల్ అయ్యేలా చేయాలన్నది టార్గెట్.

    హిరణ్య కశ్యప అప్‌డేట్..

    హిరణ్య కశ్యప అప్‌డేట్..

    హాథీ మేరా సాథీ నిర్మాణానంతర పనులు సాగుతున్నా దానికి సంబంధించిన తాజా అప్ డేట్ రాలేదింకా. హిరణ్యకశిప వచ్చే సమ్మర్ లో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అధికంగా ఉండటం కారణంగా ఈ సినిమాను 150 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబోతోన్నట్లు టాక్. ప్రసుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు షాట్ డివిజన్, ఫొటోగ్రఫీ బ్లాక్స్ తో సహా బౌండ్ స్క్రిప్ట్‌ను పూర్తిగా రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

    మరో చిత్రంతో..

    మరో చిత్రంతో..

    ఇవి కాకుండా తేజ చెప్పిన మరో కథను కూడా లాక్ చేశాడని తెలుస్తోంది. నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో ఆసక్తికర సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఇందులో రానా నెగెటివ్ రోల్‌లో నటించనున్నాడట. అంతేకాకుండా ఇందులో మరో హీరో కథానాయకుడిగా నటిస్తారు. రాక్షస రాజ్యంలో రావణాసురుడు అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

    Recommended Video

    Cine Box : RGV Backs Off From 'Mega Family' | Latest Movie Updates | Filmibeat Telugu
    రానా-తేజ కాంబినేషన్ ఫలించేనా..?

    రానా-తేజ కాంబినేషన్ ఫలించేనా..?

    టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు తేజ. చాల సంవత్సరాల తరువాత రానాతో తీసిన ‘నేనేరాజు నేనేమంత్రి' అనే చిత్రంతో సూపర్ హిట్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్‌లోకి ఎక్కాడు. మళ్లీ ‘సీత' సినిమాను తీసి చేతులు కాల్చుకున్నాడు. అందుకే ఈ సారి తనకు కలిసొచ్చిన కాంబినేషన్ తోనే మళ్ళీ మరో సినిమాతో రాబోతున్నాడు. మరి ఈ చిత్రం వీరిద్దరి ఎలాంటి అనుభవాన్ని మిగుల్చుతుందో చూడాలి.

    English summary
    Rana Movie updates With Gunasekhar Hiranya Kashyapa And Teja Rakshasa Rajyam Lo Ravanudu. Now He Is Busy With Venu Udugula Virataparvam Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X