అల్లు అర్జున్ సినిమా పోలికలతో రాణా 'నా ఇష్టం'?

By Srikanya

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య అప్పట్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు తోలేటి ప్రకాష్ దర్శకుడుగా పరిచయమవుతూ రాణా హీరోగా ఓ చిత్రం రూపొందించారు. ఆ చిత్రం ఆర్య లాగేనే సాగుతుందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. రాణా, జెనీలియా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'నా ఇష్టం'. ఈ నెల 23న విడుదల అవుతున్న ఈ చిత్రంలో రాణా..గణేష్ గా ఓ డిఫెరెంట్ పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర ప్రకారం... నేను... అనే మాటకే అతను తొలి ప్రాధాన్యమిస్తాడు. చుట్టుపక్కలవాళ్లు 'నువ్వు ఒట్టి స్వార్థపరుడివి' అన్నా పట్టించుకోడు. 'అవును నేనంతే... అలాగే ఉండటం నాకిష్టం' అంటాడు. నాకేంటి లాభం? అని ప్రశ్నించుకొన్నాకే ఏ పనైనా మొదలుపెడతాడు గణేష్‌. ఎవరికోసమో మన ఇష్టాయిష్టాల్ని మార్చుకోకూడదంటాడు. తనకంటూ కొన్ని ప్రత్యేకమైన అభిరుచులు కలిగిన అతను తొలి చూపులోనే ఓ అమ్మాయిని ప్రేమలో పడతాడు. ఆమే కృష్ణవేణి(జెనీలియా) ఆమె పూర్తిగా గణేష్ క్యారెక్టర్ కి విరుద్దం.

నలుగురి గురించి ఆలోచించాకే తనదాక వస్తుంది.వీరిద్దరూ అనుకోని పరిస్దితుల్లో మలేషియాలో ఒకరికొకరు పరిచయమవుతారు. మరి ఆమె దగ్గర కూడా ఇలాగే వ్యవహరించాడా? అసలు వాళ్ల ప్రేమ ఫలించిందా? లేదా? అనే విషయాలతో సాగే చిత్రమిది. పరుచూరి కిరీటి నిర్మాత. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ '' వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది. ఉగాది రోజున వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు అన్ని రుచులనూ పంచుతుంది''అన్నారు. ''ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. రాణా, జెనీలియా నటన ప్రేక్షకుల్ని అలరిస్తుంది''అన్నారు నిర్మాత. సంగీతం: చక్రి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X