హీరోగా కంటే ఎఫైర్లతోనే పాపులర్ అవుతున్న యంగ్ హీరో
'లీడర్" సినిమాటైమ్ లో రిచాగంగోపాధ్యాయతో ఎఫైర్ మెయింటైన్ చేస్తున్నాడంటూ వార్తల్లోకెక్కిన హీరో రాణా..ఈ సినిమాకు ముందు నుండే హీరోయిన్ శ్రియతోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడంటూ ప్రచారం జరిగినా అవేమీ పట్టించుకుకోని రాణా ఇప్పటికీ 'దమ్ మారో దమ్"తో కలిపి చేసింది మూడు చిత్రలే అయినా సినిమాకో హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్న హీరోగా పేరుకొట్టేశాడు..ఇక 'నేను నా రాక్షసి" అంటూ పూరిజగన్నాథ్ రూపొందించిన సినిమా టైమ్ లో ఇలియానాకు కాస్ట్లీ గిప్ట్ లు అందించి రూమర్స్ కి తెరలేపిన రానా 'దమ్ మారో దమ్" సినిమా షూటింగ్ టైమ్ లోనూ సెక్సీ లేడీ బిపాషాబసుకు కోటిరూపాయల దాకా అర్పించుకున్నాడని బాలీవుడ్ మీడియా ఓ రేంజ్ లో కోడైకూసింది..
కాగా దాన్ని మరిచిపోకముందే ఇప్పుడు రాణా మరో హీరోయిన్ కు భారీస్థాయిలో గిప్ట్ లు అందించేందుకు తహతహలాడుతున్నాడట..ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు బొమ్మరిల్లు హాసిని జెనీలియా..ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'నా ఇష్టం" అనే చిత్రంలో జంటగా నటిస్తున్నారు..ఈ మూవీ ఈ మద్యే ప్రారంభమైంది..సినిమా సినిమాకు హీరోయిన్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ భారీ స్థాయిలో గిప్ట్ లు అందజేస్తూ లక్షల్లో డబ్బులు అర్పించుకుంటున్న రాణా హీరోగా కంటే ఎఫైర్లతోనే పాపులర్ అవుతుండటం విశేషం..


Click it and Unblock the Notifications











