'అందాల రాక్షసి'దర్శకుడు నెక్ట్స్ ప్లాఫ్ హీరోతో...

By Srikanya

హైదరాబాద్ : అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన హను రాఘవపూడి తన తదుపరి ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆ చిత్రంలో హీరోగా వరస ప్లాఫుల హీరో దగ్గుపాటి రానా నటించే అవకాసం ఉందని తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రం చూసిన రానా వెంటనే ఈ దర్శకుడుతో పనిచేయటానికి ఆసక్తి చూపించినట్లు చెప్తున్నారు. దాంతో రానాని కలిసిన హను ఓ స్టోరీలైన్ చెప్పటం..వెంటనే ఓకే చేయటం జరిగిందని వినికిడి.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అందాల రాక్షసి'. ఈ చిత్రం రెండు వారాల క్రితం డివైడ్ టాక్ తో విడుదలైంది. ఈ చిత్రంలో రాజమౌళి షేర్ తీసుకున్నారు. ఆయన ప్రమోషన్ లో కూడా విరివిగా పాల్గొన్నారు. దర్సకుడు మాట్లాడుతూ.. సినిమా ప్రారంభమైన రోజు నుంచి అత్యంత శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. అందరూ చాలా నేచురల్‌గా నటించారు. నా నమ్మకమే నాకు శక్తినిచ్చింది. రాజమౌళిగారు, దిల్‌రాజుగారు ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. అందాల రాక్షసి హిట్టవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

ఇక రానా విషయానికి వస్తే ప్రస్తుతం...క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. కృష్ణం వందే జగద్గురం టైటిల్ తో రూపొందే ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూ గా జరుగుతోంది. ఈ చిత్రంలో రానా బిటెక్ బాబు గా కనిపించనున్నాడు. ఆ పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు. మైనింగ్ మాపియా మీద యుద్దం ప్రకటించే కుర్రాడిగా రానా కనిపిస్తాడని, అతను ఈ చిత్రంలో నాటకాలు వేస్తాడని అంటున్నారు.

క్రిష్ మీడియాతో రానా పాత్ర గురించి మాట్లాడుతూ...అతని పేరు బాబు. చదివింది బీటెక్‌. అందుకే అన్నీ హైటెక్‌ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. అసలింతకీ ఈ బీటెక్‌ బాబు కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్‌ బాబు మాస్‌ అయితే దేవిక క్లాస్‌. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X