రాణా హీరోగా ఎన్టీఆర్ క్లాసిక్ రీమేక్!?

By Srikanya

శేఖర్ కమ్ముల లీడర్ తో పరిచయమైన రాణా తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రం మహానటుడు ఎన్టీఆర్ క్లాసిక్ హిట్ రాముడు భీముడు చిత్రం రీమేక్ అని వినపడుతోంది. ద్విపాత్రాలున్న ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించి ఇప్పటికీ ఆ తరహా చిత్రాలకు నమూనాగా నిలుస్తోంది. దాంతో ఆ చిత్రాన్నే ఈ కాలానికి తగినట్లు మార్చి హిట్ కొట్టాలని సురేష్ బాబు...రాఘవన్ కి చెప్పి చేయిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో సాగే ఈ చిత్రాన్ని అంతకుముందు జూ ఎన్టీఆర్ తో చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. దాంతో రాణాతో ఆ ముచ్చట తీర్చుకోవాలని చూస్తున్నారు. రామానాయుడు ఈ చిత్రం వ్యవహారాలు దగ్గరుండి చూస్తున్నారు. ఇక రాణా ప్రస్తుతం దమ్ మారో దమ్ అనే హిందీ చిత్రంలో చేస్తున్నారు. బిపాసాబసు రాణా సరసన చేస్తోంది. అలాగే మరో చరిత్ర కూడా దిల్ రాజు ఈ మధ్యన రీసెంట్ గా రీమేక్ చేసి డిజాస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X