twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానా కొత్త చిత్రం టైటిల్ 'కవచం'

    By Srikanya
    |

    హైదరాబాద్ : రాజమౌళి 'బహుబలి' ప్రాజెక్టులో బిజీగా ఉన్న దగ్గుపాటి రానా తన తదుపరి చిత్రానికి కథ ఓకే చేసారు. ఆ చిత్రానికి టైటిల్ కవచం అని పెట్టినట్లు సమాచారం. అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన హను రాఘవపూడి ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నారు. అందాల రాక్షసి చిత్రం చూసిన రానా వెంటనే ఈ దర్శకుడుతో పనిచేయటానికి ఆసక్తి చూపించినట్లు చెప్తున్నారు. దాంతో రానాని కలిసిన హను ఓ స్టోరీలైన్ చెప్పటం..వెంటనే ఓకే చేయటం జరిగిందని వినికిడి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అందాల రాక్షసి' చిత్రం డివైడ్ టాక్ తో విడుదలై నిర్మాతకు నష్టాలు మిగిల్చింది.

    ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బహుబలి'లో దగ్గుబాటి యువ హీరో రాణా నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సోదరుడి పాత్రలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. చిత్రం రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 'బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.

    ఇక బాహుబలి చిత్రం గురించి రానా ట్వీట్ చేస్తూ.... " బాహుబలి రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలనుంచి రాత్రి పది గంటల వరకూ కంటిన్యూగా షూట్ జరుగుతోంది. ఆదివారం అయితే ... ఉదయం ఏడు గంటలకు మొదలు పెట్టి...సోమవారం ఉదయం ఎనిమిదింటి దాకా షూట్ చేసాం.. 24 గంటలు పాటు షూటింగ్ లో పాల్గొన్నాను ."అని ట్వీట్ చేసారు.

    తన చిత్రాలు గురించి రానా వివరిస్తూ... భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు చేస్తున్నా.. ఈ రెండింటిలోనూ హీరోయిన్‌ అనుష్కే.. నాకన్నా సీనియర్‌ అని చెప్పుకొచ్చారు. ఇవి కాక అందాల రాక్షసి దర్శకుడు హను దర్శకత్వంలో హిందీ-తెలుగు చిత్రం, సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెలుగు-తమిళం ద్విభాషా చిత్రాలు చేస్తున్నా. ఇవి రెండూ మా సొంత సంస్థ సురేష్‌ ప్రొడక్షన్‌లోనివే. ఈ షూటింగ్‌లన్నీ దాదాపు ఒకే సమయంలో సాగుతాయ్‌.. తెలుగుతో పాటే మరో భాషలోనూ చిత్రం విడుదలయితే నాకు బోనస్‌.. అందుకే ఇలా చేస్తున్నా అని అన్నారు.

    English summary
    Rana has okayed another new project. Rana will be acting under the direction of Hanu Raghavapudi. Hanu debuted in Tollywood with the film Andala Rakshasi. The film did not collect good money, but yes it did receive praises from all quarters. Kavacham is the title under consideration and it will be made in Hindi as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X