మహేష్ సూపర్ హిట్ రీమేక్ లో రాణా

By Srikanya

మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం ఒక్కడు. ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా గుణ శేఖర్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం త్వరలో బాలీవుడ్ లో రీమేక్ కానుంది. రానా ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని హిందీలో డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. రానా ని హిందీలో నిలబెట్టే భాధ్యత నెత్తి మీద వేసుకున్న రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంతో రానా బాలీవుడ్ లో గ్యారెంటీగా సెటిల్ అయ్యే అవకాశం ఉందని భావించి పావులు కదుపుతున్నారు. ఇక ఈ చిత్రం రైట్స్ సి.కళ్యాణ్ దగ్గర ఉన్నాయని, ఆయనే హిందీలో నిర్మించే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం వర్మ, ఈ చిత్రం స్క్రిప్టుని హిందీకి మార్పులు చేర్పులతో రెడీ చేయిస్తున్నారు. ఇక ప్రస్తుతం రానా..వర్మ తీస్తున్న డిపార్టమెంట్ చిత్రంలో చేస్తున్నారు.

మరో ప్రక్క రానా తెలుగులో క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్‌' చిత్రం చేస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాణా బిటెక్ బాబుగా కనిపించనున్నాడు. ఆ పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు దర్శకుడు క్రిష్. ఆయన మీడియాతో మాట్లాడుతూ... అతని పేరు బాబు. చదివింది బీటెక్‌. అందుకే అన్నీ హైటెక్‌ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. అసలింతకీ ఈ బీటెక్‌ బాబు కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్‌ బాబు మాస్‌ అయితే దేవిక క్లాస్‌. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది'' అన్నారు.

హీరో రాణా మాట్లాడుతూ... ఇది నాకు ఆరో సినిమా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులో నా కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పాత్రను చేస్తుండటం చాలా ఆనందంగా వుందని అన్నారు. 'గమ్యం', 'వేదం'.. ఇవి రెండూ జీవితాల్లోంచి పుట్టిన కథలు. ఇది కూడా అలాంటిదే. అయినా వాణిజ్య అంశాలకు కొదవ ఉండదు''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X