ఆ చిత్రంలో రాణా సరసన అనుష్క చేయనుందా?
త్వరలో రాణా చిత్రంలో హీరోయిన్ గా అనుష్క చేయనుందనే వార్తలు వినపడుతున్నాయి. రాణా,సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో త్వరలో రూపొందనున్న చిత్రంలో ఈ కాంబినేషన్ తెరకెక్కనుంది. ఇన్నాళ్ళూ వెంకటేష్,నాగార్జున,రవితేజ వంటి సీనియర్ హీరోల ప్రక్కనే చేస్తూ వస్తున్న అనుష్క ఎన్నాళ్ళ నుండో కుర్ర హీరోల సరసన చేయాలని ఉన్నా ఆఫర్స్ రావటం లేదు. అలాగే కుర్ర హీరోల ప్రక్కన చేస్తే ఆమె వారికి అక్కలా ఉంటుందని భావించి దర్శక, నిర్మాతలు ప్రక్కన పెడుతున్నారు. అయితే రాణా సరసన అయితే మంచి పెయిర్ అవుతుందని సెల్వ రాఘవన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఆ చిత్రం చక్కని రొమాంటిక్ కామిడీగా తెరకెక్కనుందని చెప్తున్నారు. మరో ప్రక్క రాణా మాత్రం తన ప్రక్కన లీడర్ భామ రిచానే హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుబడుతున్నాడు. రాణా ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నేనూ...నా రాక్షసి చిత్రంలో చేస్తున్నాడు. అతని సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











