రాణా, సెల్వరాఘవన్ చిత్రం విశేషాలు
శేఖర్ కమ్ముల లీడర్ తో పరిచయమైన రాణా తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రంలో రాణా..ద్విపాత్రల్లో కనపడనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే ఈ చిత్రం భారీ ఖర్చుతో రూపొందనుందని, ట్రెండ్ సెట్టర్ గా నిలవాలని సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అలాగే యుగానికొక్కడు..భారీ డిజాస్టర్ తో సెల్వ రాఘవన్ కూడా కసితో నిరూపించుకోవాలనే తపనతో ఉన్నారు. స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయిందని, సెట్ డిజైన్ కోసం పలు ఆర్ట్ డైరక్టర్స్ ని సంప్రదిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ ఇండియన్ తెరపై రాని విధంగా ఆ చిత్రం కథని సమకూర్చారని, ఇందులో ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ప్రధానాంశాలుగా గ్రాఫిక్స్ కూడా ఉంటాయని అంటున్నారు. సురేష్ బాబు టార్గెట్..రాణాతో మగధీర రికార్డులు బ్రద్దలు కొట్టాలనే అని వినపడుతోంది. ఇక రాణా ప్రస్తుతం దమ్ మారో దమ్ అనే హిందీ చిత్రంలో చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో చేస్తున్న ఈ చిత్రంలో రాణా సరసన బిపాసాబసు చేస్తోంది.


Click it and Unblock the Notifications











