నాగచైతన్య ప్లేస్ లోకి దగ్గుపాటి రానా ఖరారు

By Srikanya

హైదరాబాద్ : దగ్గుపాటి రానా మరో సినిమా కమిటయ్యినట్లు సమాచారం. నాగచైతన్య తో అనుకున్న ఛార్మినార్ చిత్రం రీమేక్ లోకి రానా వచ్చినట్లు సమాచారం. రీసెంట్ గా పోటుగాడు తో హిట్ కొట్టిన లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మొదట నాగచైతన్య తో మొదట ఈ ప్రొడక్షన్ అనుకున్నారు...ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసారు. అయితే అనుకోని విధంగా డేట్స్ సర్దుబాటు కావటంతో రానా సీన్ లోకి ఎంటరయ్యాడు. కన్నడంలో డైరక్ట్ చేసిన దర్శకుడే తెలుగులోనూ డైరక్ట్ చేయనున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

ప్రభాస్‌ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం కోసం భారీగా సెట్స్ వేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం 'గ్లాడియేటర్' తరహాలో ఓ భారీ సెట్‌ను కూడా రాజవౌళి ఈ చిత్రం కోసం రూపొందించనున్నారని చెప్తున్నారు. దీంతోపాటు విలన్ గా చేస్తున్న రానా డెన్, ఉద్యానవనాలు వంటివి కూడా సెట్టింగ్స్ వేస్తున్నారట. మొత్తంమీద చాలా ఖర్చవుతుందని అంచనా. ఈ సెట్స్ లో తీసే సీన్స్ లో సినిమాలో కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు.

ఇక దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి ఏది చేసినా అది సెన్సేషన్‌గా మారుతుంది. తాజాగా ఆయన రూపొందిస్తున్న 'బాహుబలి' చిత్రంపై ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అంచనాలు పెంచడంలో ఆయనది అందెవేసిన చేయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఆర్‌ఎఫ్‌సిలో ఇటీవలే సాబు శిరిల్ రూపొందించిన ఎరీనా సెట్‌లో రాజవౌళి రెండున్నర కోట్ల భారీ వ్యయంతో ప్రభాస్‌కు అనుష్కకు నిశ్చితార్థం దృశ్యాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో రానా, రమ్యకృష్ణలతోపాటుగా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ఈ ఒక్క సెట్‌కే రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చయితే ఇక మిగతా వాటి గురించి ఏ తరహాలో ఖర్చు చేస్తారో అన్న ఆలోచన టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

ఈ చిత్రంలో రానా ... తండ్రిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అతని కొడుకుగా పవన్ కళ్యాణ్ పంజా చిత్రం విలన్ అడవి శేషు కనిపిస్తారు. ఇద్దరవీ నెగిటివ్ రోల్సే. అలాగే గారాబంతో చెడిపోయిన కొడుకు పాత్ర అడవి శేషుది అని తెలుస్తోంది. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X