Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రానా తో సన్నిలియోన్... రాత్రి అంతా
హైదరాబాద్: సన్ని లియోన్ ఇప్పుడు ఈ పేరు బాలీవుడ్ కే కాదు తెలుగు వారికి కూడా చిపరిచతమైపోయింది. ఫోర్న్ ఇమేజ్ నుంచి ఆమె మెల్లిగా బయిటపడి హీరోయిన్ గా నిలదొక్కుకుంటోంది. అయితే షకీలా మాదిరిగా ఆమెకు అలాంటి సెక్సీ రోల్స్ వస్తున్నాయి. మంచు మనోజ్ చిత్రం కరెంట్ తీగ లో చేస్తున్న ఆమె ఇప్పుడు మరో తెలుగు హీరో సరసన నటించటానికి కమిటైంది.
ఆ హీరో మరెవరో కాదు ..దగ్గుపాటి రానా... ఆ చిత్రం టైటిల్ ... వన్ నైట్ స్టాండ్. ముంబైలో ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హిందీలో నిర్మాణమయ్యే ఈ చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి రాత్రి అంతా...లేదా... ఒక రాత్రి మాత్రమే అనే టైటిల్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక కరెంట్ తీగ విషయానికి వస్తే..సన్నీలియోన్ సెగ తెలుగు చిత్రసీమకు తగలబోతున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ తెలుగు చిత్రంలో తళుక్కున మెరవబోతోంది. మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కరెంటు తీగ'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీలియోన్ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వబోతోంది. ఈ విషయాన్ని హీరో మంచు మనోజ్ ఖరారు చేసారు.
ఈ చిత్రం కోసం సన్నీకి ఆకర్షణీయమైన పారితోషికం కూడా ఇచ్చినట్టు సమాచారం. ఆ ఆకర్షయనీయమైన పారితోషికం..పాతిక లక్షలు అని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. తెలుగులో సన్నీ ఒప్పుకొన్న మొదటి చిత్రమిదే కావటంతో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారంటున్నారు. హీరోయిన్ కి కూడా అంత ఇవ్వటం లేదని అంటున్నారు. అంత రెమ్యునేషన్ అనే సరికి మొదట వెనకంజ వేసారని, అయితే మనోజ్ పట్టుపట్టి మరీ ఒప్పించాడని చెప్పుకుంటున్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ... సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర వుంది. దీనికోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని చాలా మందిని వెతికాం. అయితే అందులో నెంబర్‌వన్ ఎవరున్నారా అని వెతికితే సన్నీలియోన్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆమెనే తీసుకోవడానికి ఆమెకున్న క్రేజ్ కారణం. అంతే కాకుండా ఇందులోని పాత్ర ఆమె లాంటి నటి చేస్తేనే బాగుంటుందని భావించి సన్నీలియోన్‌ను తీసుకోవడం జరిగింది అన్నారు.