విజయ్ దేవరకొండకు వింత టైటిల్.. పేరులోనే వైబ్రేషన్ ఉందిగా!
'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి చిత్రంతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. ఆ తర్వాత కూడా వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి తన మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. అయినా ప్రాజెక్టులు లైన్‌లో పెడుతున్నాడు.
ఇటీవలే విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద పరాజయాన్నే చవి చూసింది. ఈ పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోన్న విషయం తెలిసిందే.

గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు పూర్తి కాకముందే విజయ్ దేవరకొండ తన 14వ సినిమాను కూడా లైన్‌లో పెట్టేసుకున్నాడు. దీన్ని 'ట్యాక్సీవాలా', 'శ్యామ్ సింగా రాయ్' దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై అంచనాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించబోయే ప్రాజెక్టును మరికొద్ది రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. అది పూర్తైన వెంటనే రెగ్యూలర్ షూట్‌ను షురూ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్‌పై ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండ - రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు 'రణభాలీ' (Ranabhali) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఇప్పటికే నిర్మాతలు దీన్ని ఫిలిం చాంబర్‌లో సైతం రిజిస్టర్ చేయించారని అంటున్నారు. ఇక, ఈ టైటిల్ లీక్ అయిన తర్వాత దీనిపై అందరూ చర్చిస్తున్నారు. దీంతో ఇది హాట్ టాపిక్ అయిపోయింది.

ఇదిలా ఉండగా.. ట్యాక్సీవాలా హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోందని అంటున్నారు. అలాగే, మరో హీరోయిన్‌ను కూడా తీసుకోబోతున్నారని సమాచారం. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఇది రూపొందనుందని తెలిసింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











