ముదిరిన ఎఫైర్: హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్న హీరో హీరోయిన్?
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ డేటింగులో ఉన్నట్లు కొన్ని రోజలుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, దీనికి వారి కుటుంబ సభ్యుల సమ్మతి కూడా లభించినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.
పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా ముంబైలోని ఓ ఫైస్టార్ హోటల్‌లో స్టే చేయడం చర్చనీయాంశం అయింది. ఇద్దరూ రొమాంటిక్ మూడ్ ఎంజాయ్ చేయడానికి, ఏకాంతంగా గడపటానికే ఇలా రూమ్ బుక్ చేసినట్లు వార్తలు తెరపైకి వచ్చాయి.

అందరిలోనూ అదే అనుమానం
సాధారణంగా షూటింగ్ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ హోటల్స్‌లో స్టే చేయడం సర్వసాధారణం. అయితే ముంబైలో హోటల్ రూమ్ తీసుకుని ఉండటంతో అందరిలోనూ అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

సెట్స్‌లోనూ రొమాన్సే
ప్రస్తుతం అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా ‘బ్రహ్మాస్త్ర' చిత్రంలో నటిస్తున్నారు. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న ఈ జంట ఈ సినిమా ద్వారా మరింత దగ్గరయ్యారని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య లవ్, రొమాన్స్ మొదలైనట్లు తెలుస్తోంది.

రణబీర్‌ను కలిసేందుకు న్యూయార్క్
కొన్ని వారాల క్రితం రణబీర్‌ను కలిసేందుకు అలియా భట్ న్యూయార్క్ వెళ్లింది. రణబీర్ తండ్రి రిషి కపూర్‌కు సర్జరీ జరుగడంతో అలియా వెళ్లి పరామర్శించి వచ్చారు.

వచ్చే ఏడాది వివాహం
రణబీర్, అలియా భట్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ట్విట్టర్ చాట్లో సైతం కొందరు అభిమానులు పెళ్లి గురించి ప్రశ్నించగా.... త్వరలోనే పెళ్లి చేసుకుంటా అంటూ రణబీర్ సమాధానం ఇచ్చారు.

బ్రహ్మాస్త్ర
ప్రస్తుతం అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర'లో నటిస్తున్నారు. 2019 డిసెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











