»   » కత్రినా-రణబీర్ బ్రేకప్..ఖరీదు రూ. 21 కోట్లు?

కత్రినా-రణబీర్ బ్రేకప్..ఖరీదు రూ. 21 కోట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మనం ఇప్పటి వరకు చాలా ఖరీదైన విడాకుల గురించి విన్నాం. లవర్స్ విడిపోవడం కూడా ఖరీదైన వ్యవహారమేనా? అంటే అవుననే నిరూపించారు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్. గత కొంత కాలంగా ఇద్దరూ సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. వీరి బ్రేకప్ ఎఫెక్ట్ కేవలం వారి పర్సనల్ లైఫ్ మీద మాత్రమే కాదు....ఆర్థిక పరమైన అంశాల మీద కూడా పడిందట.

ఇద్దరూ ప్రేమలో కొంతకాలం మునిగి తేలిన తర్వాత ఒకే ఇంట్లో సహజీవనం మొదలు పెట్టారు. నెలకు రూ. 15 లక్షల అద్దెతో ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాటు అద్దెకు తీసుకున్నారు. ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన తర్వాత రణబీర్ కపూర్ తన కొత్త ఇల్లు అయిన విల్సన్ అపార్టుమెంటుకు వెళ్లి పోయాడు.

కత్రినాతో కలిసున్న ఇంటి కోసం రణబీర్ కపూర్ రూ. 21 కోట్లు డిపాజిట్ చేసాడట. అయితే ఆ డబ్బు వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఎందుకంటే కత్రినా అదే ఇంట్లో ఉంటోంది.

Ranbir Kapoor and Katrina Kaif's breakup cost 21 cr

అయితే ఇద్దరి మధ్య విడిపోయేంత పెద్ద గొడవ ఏం జరిగింది? అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే రణబీర్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వాడితో జీవితాంతం కలిసి ఉండటం కష్టమని కత్రినా భావిస్తున్నట్లు ప్రచారం జరుగున్నా....మరికొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కత్రినా మాట్లాడుతూ... ‘రణబీర్ ఒక మాటమీద నిలబడే వ్యక్తి కాదు. తన నిర్ణయాలు ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటాడు. ఓ రిలేషన్ షిప్ కు కమిట్ అయ్యే వ్యక్తిత్వం కాదు' అని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య ‘సం'బంధం తెగిపోయిందనే ప్రచారం జరుగుతోంది.

English summary
Ranbir Kapoor and Katrina Kaif's breakup did not just leave impact on personal lives, but also on their bank accounts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu