»   » రియల్ లైఫ్‌లో రొమాన్స్ అనుభవించాం: అనుష్క హాట్ కామెంట్

రియల్ లైఫ్‌లో రొమాన్స్ అనుభవించాం: అనుష్క హాట్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సీన్ డిమాండ్ చేసింది, అందుకే లిప్ లాక్ ముద్దు సీన్లో నటించాల్సి వచ్చింది.....దీన్ని ఇంత పెద్ద రాద్దాంతం చేస్తారేమిటి? అంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ చిర్రుర్రులాడింది. రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా ‘బాంబే వెల్వట్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇందులో ఇద్దరూ ముద్దు సీన్లు అదరగొట్టారు.

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాల్‌రాజ్‌గా రణ్‌బీర్, రోశీగా అనుష్క నటిస్తున్నారు. ఈ రెండు పాత్రల మధ్య దాదాపు ఏడు పెదవి ముద్దు సన్నివేశాలున్నాయట. లిప్ లాక్ సీన్స్ మీకు ఇబ్బందిగా అనిపించవా? అనే ప్రశ్న అనుష్క శర్మ తనదై రీతిలో సమాధానం ఇచ్చింది.

Ranbir Kapoor, Anushka Sharma to share seven liplocks in Bombay Velvet?

రణ్‌బీర్‌కి నిజజీవితంలో ప్రేయసి ఉంది. నేను కూడా ప్రేమలో ఉన్నాను కదా. అందుకే రొమాంటిక్ సీన్స్‌ని సునాయాసంగా చేసేస్తాం అని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. ఆమె ఇలా వ్యాఖ్యానించడం ద్వారా....రియల్ లైప్ లో రొమాన్స్ చేసిన అనుభవం ఉంది కాబట్టే కెమెరా ముందు పర్ ఫెక్టుగా చేయగలిగామని చెప్పుకొచ్చింది.

అంతటితో ఆగని అనుష్క....రణ్‌బీర్‌తో రొమాంటిక్ సీన్స్ అంటే నాకు ఇబ్బందిగా అనిపించదు. ఎందుకంటే, తన మనసులో లేనిపోని ఊహలు, తప్పుడు ఆలోచనలు ఉండవు ఉండవు. ‘నటిస్తున్నాం.. అంతకు మించి ఏమీ లేదు' అనుకుంటాడు. నేనూ అలానే అనుకుంటా. అందుకే మా కెమిస్ట్రీ బాగుంటుంది'' అని చెప్పారు.

English summary
Ranbir Kapoor will be seen romancing PK actress Anushka Sharma in their much-awaited movie ‘Bombay Velvet’ soon. The film’s trailer will also be out this weekend and now reports that the two actors will be seen sharing passionate lip lock in the Anurag Kashyap movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu