Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హిట్టు పడిందిగా.... రేటు పెంచేశాడు, రోజుకు రూ. 6 కోట్లు ఇస్తేనే చేస్తాడట!
'సంజు' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.... వాణిజ్య ప్రకటనలకు తాను తీసుకునే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశాడట. ఇంతకు ముందు రోజుకు రూ. 3 నుండి రూ. 3.5 కోట్లు చార్జ్ చేసే ఈ యంగ్ హీరో ఇపుడు రోజుకు రూ. 6 కోట్లు ఇస్తే తప్ప ఎలాంటి యాడ్స్, ఫోటో షూట్లు చేయబోనని బీష్మించుకుని కూర్చున్నాడని టాక్.
ప్రస్తుతం రణబీర్ కపూర్ ఏషియన్ పేయింట్స్, పెప్సి, పానసోనిక్, రెనాల్ట్, ప్లిప్‌కార్ట్, మాక్రోమాన్, సావన్, హీరో మోటోకార్ప్ లాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. 'సంజు' హిట్ తర్వాత రణబీర్ బ్రాండ్ వ్యాల్యూ పెరిగిందని, అందుకే రేటు కూడా పెంచినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఇండియన్ యాడ్ మార్కెట్లో అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ కలిగిన సెలబ్రిటీల్లో నెం.1 స్థానంలో విరాట్ కోహ్లి (రూ. 912 కోట్లు), షారుక్ ఖాన్ (రూ. 678 కోట్లు, దీపిక పదుకోన్ (రూ. 595 కోట్ల)తో టాప్ పొజిషన్లో ఉన్నారు. రణబీర్ స్టార్ ఇమేజ్ కూడా తక్కువేమీ కాదని, వారితో పోలిస్తే అతడు డిమాండ్ చేసేది తక్కువే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.
సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణబీర్ కపూర్ యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న 'షంషీరా' చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్ర' చేయబోతున్నాడు. ఈ చిత్రంలో అతడి గర్ల్ ఫ్రెండ్ అలియా భట్‌తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నారు.