Ramayana : రణబీర్ కపూర్ కు భారీ రెమ్యునరేషన్.. ఎన్ని వందల కోట్లో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. అప్పటికే ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ డబ్డ్ వెర్షన్ లో విడుదలై ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతో రణబీర్ కపూర్ కు సౌత్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఫలితంగా ఆయన సినిమాకు ఇక్కడా మంచి డిమాండ్ పెరిగింది. చివరిగా బ్రహ్మాస్త్రం, యానిమల్ చిత్రాలను డైరెక్ట్ రిలీజ్ చేసి సెన్సేషన్ గా మారారు. యానిమల్ చిత్రం తర్వాత రణబీర్ కపూర్ కు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

రామాయణతో మరి అడుగు ముందుకు..
ప్రస్తుతం ఇండియాలో రణబీర్ కపూర్ నార్త్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఇప్పటికే సౌత్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు రఫ్ఫాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో భారీ చిత్రాలను నిర్మించేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రణబీర్ కపూర్ కూడా రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మస్త్రతో సూపర్ హీరో పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం తొలిసారిగా మైథలాజికల్ ఫిల్మ్ లో, అది కూడా రాముడి పాత్రలో నటిస్తూ ఆయన కెరీయర్ లో మరో అడుగు ముందుకు వేశారు.

Ranbir Kapoor Huge Remuneration

భారీ బడ్జెట్ తో రామాయణ..
ఇండియాలో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం రామాయణ. హిందీ భాషలో రామాయణ : పార్ట్ 1, రామాయణ : పార్ట్ 2లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్ లో రూ.1600 కోట్లతో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి కన్నడ సూపర్ స్టార్ యష్ కో ప్రొడ్యూసర్ గా ఉండటం విశేషం. కన్నడ స్టార్ యష్ రావణుడి పాత్రలను పోషిస్తున్నారు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సీతగా అలరించబోతోంది. మరిన్ని పాత్రల్లో స్టార్ కాస్ట్ నటిస్తుండటం విశేషం.

రణబీర్ కపూర్ రెమ్యునరేషన్..
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ చిత్రాలకు ప్రస్తుతం ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ డిమాండ్ ఉండింది. యానిమల్ చిత్రం తర్వాత రణబీర్ సినిమాలపై మరింత ఇంట్రెస్ట్ కుదిరింది. పైగా హిందూ పురాణం రామాయణ కథతో అందులోనూ రాముడిగా రణబీర్ కపూర్ కనిపిస్తుండటం మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది.

అయితే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న రామాయణ చిత్రానికి రణబీర్ కపూర్ కేవలం రూ.65 కోట్లు మాత్రమే పారితోషికం తీసుకుంటున్నారంట. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కు 100ల కోట్ల రూపాయాలు డిమాండ్ చేసినా తప్పులేదని అంటున్నారు. ఇక రామయణ : పార్ట్ ను 2026 దీపావళికి విడుదల చేయబోతున్నారు. 2వ పార్ట్ ను 2027 దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రణబీర్ నుంచి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ పార్క్ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అలాగే మరిన్ని హిందీ చిత్రాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X