స్మోక్ చేస్తూ దొరికిన హీరో, హీరోయిన్.... రాత్రిపూట ఎఫైర్?
రణబీర్, మహీరా ఖాన్ స్మోక్ చేస్తూ దొరికిపోయారు. ఇద్దరూ ప్రస్తుతం న్యూయార్కులో గడుపుతున్నారు.
బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్... కపూర్ కత్రినా కైఫ్ తో విడిపోయిన తర్వాత పాకిస్థాన్ బ్యూటీ, రయిస్ మూవీ హీరోయిన్ మహీరా ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి తిరుగుతుండటంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.
ఇప్పటి వరకు వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు సరైన సాక్ష్యాలు లేవు. అయితే తాజాగా వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. న్యూయార్క్ లో రాత్రి పూట ఓ హోటల్ వద్ద స్మోక్ చేస్తూ ఇద్దరూ మీడియా కెమెరాలకు చిక్కారు.

ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారా?
ఇంటర్నెట్ లో లీక్ అయిన ఈ ఫోటోలపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని, డేటింగ్ నడుస్తోందని చర్చించుకుంటున్నారు.

మహీరా వీపుపై గాయం రణబీర్ లవ్ బైటా?
ఈ ఫోటోలో మహీరా ఖాన్ వీపుపైన పంటితో కొరికినట్లు చిన్న గాయం కనిపిస్తోంది. ఇద్దరి మధ్య సరస సల్లాపాలు జరిగే సమయంలో రణబీర్ వల్ల కలిగిన లవ్ బైట్ అని అంతా చర్చించుకుంటున్నారు.

దుబాయ్‌లో కూడా
రణబీర్ కపూర్, మహీరా ఖాన్ కొన్ని రోజుల క్రితం దుబాయ్ లో జరిగిన ఓ ఈవెంటులో కూడా కలిసి కనిపించారు. అప్పుడే ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు రూమర్స్ ప్రారంభం అయ్యాయి. తాజాగా న్యూయార్క్ ఫోటోలతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి.

ఏది నిజం?
రణబీర్ అమెరికా ఎందుకు వెళ్లాడు? అనే విషయమై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను కలిసేందుకే అని కొందరు, సంజయ్ దత్ బయోపిక్ కోసం అంటూ కొందరు వాదిస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తేలాల్సి ఉంది.

ఇద్దరి మధ్య సాన్నిహిత్యం గురించి..
రణబీర్, మహీరా చాలా క్లోజ్ గా ఉంటారని, ఆమె గురించి రణబీర్ చాలా గొప్పగా చెబుతుంటాడని, తన ఫోన్లో ఉన్న ఆమె ఫోటోలను ఫ్రెండ్స్ కు చూపిస్తుంటాడని.... గతంలో ఓ ఇంటర్వ్యూలో రణబీర్ ఫ్రెండ్ ఒకరు చెప్పుకొచ్చారు.

మహీరా గురించి రణబీర్
కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ... పాకిస్థాన్ బ్యూటీ మహీరా ఖాన్ చాలా ప్రెట్టీగా ఉంటుందిన కామెంట్ చేశాడు. ఆమె మీద క్రష్ ఉండబట్టే రణబీర్ అలా అని ఉంటాడని టాక్.

రణబీర్ గురించి మహీరా ఖాన్
గతంలో ఓ సారి రణబీర్ గురించి మహీరా ఖాన్ మాట్లాడుతూ... ‘యంగ్ హీరోల్లో రణబీర్ కపూర్ బ్రిలియంట్ యాక్టర్' అని చెప్పింది.

ఇద్దరి మధ్య ఎఫైర్
ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని చెప్పడానికి బలమైన కారణాలు చాలా కనిపిస్తున్నాయని బాలీవుడ్ మీడియాలో కోడై కూస్తోంది.


Click it and Unblock the Notifications











