నర్గిస్‌పై రణబీర్ తల్లి ఆసక్తి వెనక అసలు సంగతి?
బాలీవుడ్ యువహీరో రణబీర్ కపూర్ ఎఫైర్ల గురించి ఎంత చెప్పినా తక్కవే. ఈ యంగ్ హీరో కోసం చాలా మంది హీరోయిన్లు పడి చస్తుంటారు. తాజాగా ఈ హీరో 'రాక్ స్టార్" మూవీలో నర్గీస్ ఫక్రి అనే పాక్ భామతో నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య 'సం"బంధం ఏర్పడిందని, డేటింగ్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రణబీర్ మదర్ నీతు నర్గీస్ తో చాలా క్లోస్ గా మూవ్ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీరి బంధం పెళ్లి వరకు వెలుతోందా? అందుకే నీతూ నర్గీస్ తో క్లోజ్ గా ఉంటోందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ జనాలు.
ఇటీవల రణబీర్ బర్త్ డే చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీ స్ హాజరయ్యారు. రణబీర్ మాజీ లవర్స్ ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనె కూడా ఈ పార్టీకి వచ్చారు. అయితే వీరితో అంటీముట్టనట్లుగా ఉన్న నీతూ కేవలం నర్గీస్ తో రాసుకుపూసుకు తిరగడం, అందరికీ పరిచయం చేయడం లాంటివి చేసిందట. దీంతో నీతూ ఆమెను కోడలిగా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతోందనే గుసగసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











