»   » ఈ విషయం తెలిస్తే షాక్ తింటారు, ఇంత హాట్ ప్రేమాయణం మనకు తెలియనే లేదు...

ఈ విషయం తెలిస్తే షాక్ తింటారు, ఇంత హాట్ ప్రేమాయణం మనకు తెలియనే లేదు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

శృతీ హసన్ ఇప్పుడు సౌతిండియన్ ఇండస్ట్రీ లోనే కాదు బాలీవుడ్ లో కూదా మంచి డిమాండ్ ఉన్న భామ. నట దిగ్గజం కమల్ హసన్ కూతురు గా నటనా రంగం లోకి వచ్చినప్పటికీ ఆ మార్క్ తన మీదనుంచి తప్పించుకొని సొంతంగా తనకంటూ ఒక ఫ్లాట్ఫాం ఏర్పరుచుకుంది.తనకు నచ్చినట్టుగానే ప్రవర్తిస్తుంది. వద్దనకుండా స్కిన్‌షో చేస్తుంది, లిప్‌లాక్‌లకు సై అంటుంది, చాలా బోల్డ్‌గా మాట్లాడుతుంది.

కోలీవుడ్‌, టాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌పైనే అమ్మడు ఫోకస్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మాడి తో కలిసి వినిపిస్తున్న పేరు రణ్ బీర్ కపూర్. అవును మీరు అనుయ్కునేది నిజమే... బాలీవుడ్ లో వెంత వెంతనే ప్రేమికుల ప్రేలు మారిపోతూంటాయి. నటుల జీవితాల్లో ఇది సర్వ సాధారణం. కతినా తో పెళ్ళివరకూ వచ్చి విడిపోయిన రణ్ బీర్ ఇప్పుడు శృతీ హసన్ వెంట పడ్డాడట... ఈ జంట గురించిన మరిన్ని వివరాలు...

 దీపికాతో బ్రేకప్ తర్వాత:

దీపికాతో బ్రేకప్ తర్వాత:

బాలీవుడ్ లో బ్రేకప్ లు చాలా కామన్. ఎంత త్వరగా బ్రేకప్ చెప్పేస్తారో అంతే త్వరగా మరో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసేస్తారు. చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్, దీపికా పదుకొనే పెయిర్ కొంత కాలం చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే వీరి లవ్ బ్రేక్ పడింది. దీపికాతో బ్రేకప్ తర్వాత రణ్ బీర్ కపూర్, పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్ తో రిలేషన్ మెయింటేన్ చేసాడు. ఇది కూడా ఎంతో కాలం నిలవలేదు. రీసెంట్ గా వీరిద్దరూ విడిపోయారు.

ప్రేమని నిలబెట్టుకోలేకపోయారు:

ప్రేమని నిలబెట్టుకోలేకపోయారు:

ఒకదశలో పెళ్ళివరకూ వచ్చిన జంట హఠాత్తుగా విడిపోతున్నాం అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. కొన్ని సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో కలిసే ఉన్న తర్వాత కూడా కత్రినా.., రణ్ బీర్ కపూర్ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని నిలబెట్టుకోలేకపోయారు. వాస్తవానికి ...రణ్‌బీర్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌ల ఇద్దరూ తొలిసారిగా కలసి నటించిన 'అజబ్‌ ప్రేమ్‌ కీ ఘజబ్‌ కహానీ' సమయం నుంచే వారి మధ్య బంధం అల్లుకుంది. కానీ తమ ప్రేమ విషయం బయటపడకుండా ఇద్దరూ చాలా కాలమే జాగ్రత్తపడ్డారు. అయితే వారు రహస్యంగా షికార్లు చేస్తున్న ఫొటోలు మీడియాకు చిక్కడంతో ఇద్దరి మధ్య 'సమ్ థింగ్' అన్న ప్రచారం మొదలైంది. రణబీర్ ఈ విషయాన్ని ఎట్టకేలకు ఒప్పుకున్నాడు కూడా.

రణ్ బీర్ అప్ సెట్ :

రణ్ బీర్ అప్ సెట్ :

కుర్రకారు హాట్ ఫేవరేట్ అలియా భట్ నే ఈ బ్రేక్ అప్ సీన్ కు మూలకారణమని బాలీవుడ్ చెవులు కొరుక్కుంది. కొన్ని నెలల క్రితం రణ్ బీర్, కత్రినా ఓ బర్త్ డే పార్టీకి వెళ్లారు. ఆ పార్టీలో రణ్ బీర్ తో అలియా రాసుకుని.. పూసుకుని తిరిగిందట. ఈ ఇద్దరినీ అలా చూసి తట్టుకోలేకపోయిన కత్రినా.. ఇంటికొచ్చిన తర్వాత రణ్ బీర్ తో పెద్ద గొడవే పెట్టుకుందట. దీంతో రణ్ బీర్ అప్ సెట్ అయ్యాడట. ఆ గొడవతోనే రణ్ బీర్, కత్రినా కటీఫ్ అయ్యారన్నారు బాలీవుడ్ జనం. అదే సమయం లో అలియా కూడా... రణ్ బీర్ పై తన ప్రేమను బహిరంగంగానే ఒలకబోసింది. రణ్ బీర్ ను పిచ్చిగా లవ్ చేస్తున్నానని చెప్పింది ఈ అందాల చిన్నది.కానీ అదీ సీరియస్ అఫైరేం కాదని త్వరలోనే తేలిపోయింది ఈ ప్రేమ కథ పుకారుగానే కొట్టి పడేసారు అంతా..

బందం ఎందుకోగానీ అకస్మాత్తుగా తెగిపోయింది:

బందం ఎందుకోగానీ అకస్మాత్తుగా తెగిపోయింది:

రణ్ బీర్ కపూర్ కత్రినా కైఫ్ ఇద్దరూ ఒకరిని ఒకరు కలిసేనాటికే చెరో విఫల ప్రేమని చవి చూసారు. అటు దీపికా పదుకోణ్ తో రణ్ బీర్, ఇటు సల్మాన్ తో కత్రినా తెగదెంపులు చేసుకొని ఉన్నారు. కానీ ఈ ఇద్దరిమధ్య ప్రేమ పుట్టిన తర్వాత ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమలోతుల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. వీరి సాన్నిహిత్యం చూసిన జనాలంతా వీరు త్వరలో ఒకటైపోతారని కూడా భావించారు. కత్రినా కూడా పలుమార్లు తమ వివాహం గురించి కూడా ప్రస్తావించింది. ఇంతలోనే ఏమైందో కానీ తూచ్..అంటే తూచ్ అనుకున్నారిద్దరూ.. దాదాపుగా పెళ్ళీవరకూ వచ్చిన వీరి బందం ఎందుకోగానీ అకస్మాత్తుగా తెగిపోయింది.

ఇప్పటివరకూ క్లారిటీ లేదు:

ఇప్పటివరకూ క్లారిటీ లేదు:

అసలు 2016కు వీళ్ల బ్రేకప్ తోనే బాలీవుడ్ వెల్ కం చెప్పింది. వీళ్లెందుకు విడిపోయారనే విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు... ఎప్పూడూ ఎక్కడా నోరు విప్పలేదు... ఇద్దరూ మౌనం గానే ఉండిపోయారు.. కానీ ఎక్కువ రోజులు భాదని దాచుకోలేక పోయాడేమో రణ్ బీర్ మాత్రం బయట పడిపోయాడు.... తన గుండె ముక్కలైనట్టుగా అనిపించిందంటూ తమ బ్రేకప్ విశయం లో భాదపడ్డట్టు కనిపించాడు.

త్వరలోనే మేం కలుసుకోవచ్చు:

త్వరలోనే మేం కలుసుకోవచ్చు:

అయితే తామిద్దరూ మళ్ళీ తిరిగి కలుస్తున్నట్లు.. ప్రత్యేకంగా మీట్ అయినట్లు వచ్చిన వార్తలని పుకార్లే అంటూ కొట్టిపడేసాడు..."ఈ మధ్య కాలంలో కత్రినాని కలవలేదు కానీ త్వరలోనే మేం కలుసుకోవచ్చు... అయితే అది వృత్తిలో భాగం గా మాత్రమే"...అని డిక్లేర్ చేసాడు.

ప్రేమ కథ మరింత ఇంట్రస్టింగ్ :

ప్రేమ కథ మరింత ఇంట్రస్టింగ్ :

తాజాగా విడుదలైన ‘ఉడ్తా పంజాబ్‌' సినిమాని చూసేందుకు బాలీవుడ్‌ ప్రముఖులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనకు వచ్చారు. కత్రినాతో కలిసి చూసేందుకని రణ్‌బీర్‌ తన స్నేహితుల్ని వదిలిపెట్టి మరీ వెళ్తే.. కత్రినా మాత్రం అతన్ని పట్టించుకోకుండా షారుక్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌, వరుణ్‌ ధావణ్‌, ఆలియా భట్‌లతో మరో థియేటర్లో సినిమా చూసిందట. కలుసుకునే అవకాశమున్నా.. కలవక పోవటం తో ఇక ఆ ప్రేమ కథ ముగిసినట్టేనని అందరూ అర్థం చేసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త గా మొదలయిన ప్రేమ కథ మరింత ఇంట్రస్టింగ్ గా ఉంది.

 శృతి హసన్ ప్రేమలో:

శృతి హసన్ ప్రేమలో:

కత్రినా కైఫ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన బాలీవుడ్‌ లవర్‌బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో శృతి ప్రేమలో పడిపోయిందనేది ఆ షాకింగ్‌ న్యూస్‌. కేవలం బాలీవుడ్‌ జనాలే కాకుండా అక్కడి లీడింగ్‌ న్యూస్‌ పేపర్లు కూడా దీని గురించి వార్తలు వెలువరిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఇదివరకే ఓ యాడ్‌ఫిల్మ్‌ కోసం కలిసి పనిచేశారు. ఆ సమయం నుంచే స్నేహితులుగా మారిపోయిన వీరిలో ఆ తర్వాత ప్రేమ చిగురించిందని చెప్పుకుంటున్నారు.

కొన్ని రోజులు వేచి చూడాల్సిందే:

కొన్ని రోజులు వేచి చూడాల్సిందే:

అంతేకాదు రణ్‌బీర్‌ తాజా సినిమా ‘యే దిల్‌ హై ముష్కిల్‌' షూటింగ్‌ స్పాట్‌కు కూడా శృతి పలుసార్లు వచ్చిందని, షూటింగ్‌ గ్యాప్‌లో వారు మాట్లాడుకుంటూనే ఉండేవారనీ బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అంతేకాకుండా వీరిద్దరూ చాలాసార్లు నైట్‌ క్లబ్‌లకు, ముంబైలోని సబర్బన్‌ రెస్టారెంట్లకు వెళ్లారని కూడా తెలుస్తోంది. అయితే వీర మధ్య ఉన్నది ప్రేమ కాదని, కేవలం స్నేహం మాత్రమేనని ‘బాలీవుడ్‌ లైఫ్‌.కామ్‌' అనే వెబ్‌సైట్‌ వెల్లడించింది. మరి ఏది నిజమో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

ఇదే మొదటి ఎఫైర్ కాదు:

ఇదే మొదటి ఎఫైర్ కాదు:

అయితే శృతీ హసన్ కి కూడా ఇదే మొదటి ఎఫైర్ కాదు తొలి సినిమా `అన‌గ‌న‌గా ఓ ధీరుడు` స‌మ‌యంలోనే శృతిహాస‌న్ ప్రేమ‌లో ప‌డిపోయింద‌ని వార్త‌లొచ్చాయి. అందులో క‌థానాయ‌కుడిగా న‌టించిన సిద్ధార్థ్‌తోనే ప్రేమ‌లో ప‌డింద‌ని, `ఓ మై ఫ్రెండ్` సినిమా స‌మ‌యానికి అది మ‌రింత డీప్‌గా మారింద‌ని చెప్పుకొన్నారు. ఏమైందో తెలియ‌దు కానీ.. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది.

`త్రీ` స‌మ‌యంలో:

`త్రీ` స‌మ‌యంలో:

ఆ త‌ర్వాత శృతి త‌న దృష్టినంతా కెరీర్‌పైనే ప‌ట్టింది. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్... ఇలా ఎక్క‌డ నుంచి అవ‌కాశ‌మొస్తే అక్క‌డ న‌టించింది. ఈ జ‌ర్నీలో శృతిహాస‌న్ వైపు నుంచి మ‌ళ్లీ ప్రేమ‌క‌బురు మాత్రం వినిపించ‌లేదు. మ‌ధ్య‌లో `త్రీ` స‌మ‌యంలో త‌మిళ క‌థానాయ‌కుడు ధ‌నుష్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతోంద‌ని మాత్ర‌మే చెప్పుకొన్నారు. కానీ ఆ ప్ర‌చారం కూడా ఎంతోకాలం సాగ‌లేదు. వెంట‌నే చల్లారిపోయింది.

వాళ్లిద్ద‌రూ ఇప్పుడు డేటింగ్‌లో ఉన్నార‌ు?:

వాళ్లిద్ద‌రూ ఇప్పుడు డేటింగ్‌లో ఉన్నార‌ు?:

అయితే ఈమ‌ధ్య ఏకంగా ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ప్రేమాయ‌ణం సాగిస్తోందంటూ శృతిపై పుకార్లు మొద‌ల‌య్యాయి. క‌త్రినాకైఫ్‌కి దూర‌మ‌య్యాక ర‌ణ్‌బీర్ శృతికే ద‌గ్గ‌ర‌య్యాడ‌ని, వాళ్లిద్ద‌రూ ఇప్పుడు డేటింగ్‌లో ఉన్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెవులు కొరుక్కొంటున్నాయి. మ‌రి అందులో ఎంత నిజ‌ముందన్న‌ది తెలియాల్సి వుంది.

English summary
As per the reports that are doing the rounds, the two actors Ranbeer kapoor and Sruthi hasan were seen chatting in between the shots of a Add filim and they even went for a cozy dinner at a suburban restaurant later.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu