కత్రినా ఇంట్లో అర్థరాత్రి రణబీర్, మీడియాను చూసి జంప్!

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ క్రేజీ స్టార్స్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ మరోసారి వార్తల్లోకెక్కారు. వీరి మధ్య ఎఫైర్ ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో చాలా పుకార్లు షికార్లు చేసాయి. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని అటు కత్రినాతో పాటు, ఇటు రణబీర్ కపూర్‌ కూడా చాలా సందర్భాల్లో కొట్టి పారేసారు.

అయితే తాజాగా ఆ పుకార్లకు బలం చేకూరుస్తూ...రణబీర్ కపూర్ గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత కత్రినా ఇంటికి చేరుకుని మీడియా కంటపడ్డాడు. బ్లూ జీన్స్, బ్రైట్ బ్లూ షర్ట్, రెడ్ క్యాప్ ధరించిన రణబీర్ అంత రాత్రి పూట ఆమె ఇంటికి చేరుకోవడం అందరినీ ఆశ్యర్య పరించింది. అయితే వెంటనే మీడియా వారు అక్కడికి చేరుకోవడంతో ఖంగుతిన్న రణబీర్ అక్కడి నుంచి జంప్ అయ్యాడు. ఈ నేపథ్యంలో వీరి బంధంపై బాలీవుడ్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

సల్మాన్‌తో విడిపోయాక క్రతినా రణబీర్ కపూర్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ వస్తోంది. తన అందచందాలతో కుర్రాడయిన రణబీర్‌ను తన వశం చేసుకుందని, అందుకే రణబీర్ ఆమె చుట్టూ తిరుగుతున్నానే గుసగుసలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం రణబీర్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ మొత్తానికి తెలుసు.

మొన్న ఈ మధ్య మీడియా కంట్లో పడకుండా రహస్యంగా రణబీర్‌కపూర్‌ ఇంటికి కత్రినా వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. ఆమె అక్కడకు వెళ్ళి తరువాత రణబీర్‌ లేకపోవడంతో అక్కడనే వెయిట్‌ చేసింది. మీడియాను తప్పుదోవ పట్టించేందుకు తన కారును వెనక్కు పంపించేసిందని వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు అక్కడకు చేరుకున్న రణబీర్‌ కపూర్‌తో మిడ్‌నైట్‌ డిన్నర్‌ చేసింది. డిన్నర్‌ అయిన తరువాత ఇంటికి వెళ్ళకుండా అక్కడనే రణబీర్‌కపూర్‌తో చాలాసేపు గడిపిందంట. ఇవన్నీ చూస్తుంటే...రణబీర్, కత్రినా మధ్య కుచ్ కుచ్ హోతాహై లాంటిదోనే జరిగిందనే అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X