ప్రభాస్ ‘స్పిరిట్'తో బాలీవుడ్ స్టార్ హీరో.. సందీప్ రెడ్డి వంగా అరాచకం పీక్.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' సెట్స్‌పైకి దూసుకెళ్లింది. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలతో యూత్‌పై గట్టి ఇంపాక్ట్ చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ముహూర్తంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మాస్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. ఇంతకీ ఏంటీ?

'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ క్యారెక్టర్ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా రూపొందించిన కథనం రాసుకున్నట్టు తెలుస్తోంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌ను మాత్రమే కాకుండా, హీరో వ్యక్తిత్వంలో దాగి ఉన్న ఎమోషన్‌లను కూడా హైలైట్ చేసే విధంగా కథ సాగనుందని సమాచారం. వంగా స్టైల్ తెలిసిన ప్రేక్షకులకు, 'స్పిరిట్' సాధారణ కమర్షియల్ మూవీ కాదనీ, హై-ఆక్టేన్, హై-ఇంపాక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్, అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందుతోందని భావిస్తున్నారు.

Ranbir Kapoor to Join Prabhas-Sandeep Reddy Vanga s Spirit for a High-Impact Cameo

ఈ సినిమాలో హీరోయిన్‌గా 'యానిమల్'తో సెన్సేషన్ సృష్టించిన తృప్తి డిమ్రి నటిస్తోంది. ఆమె పాత్ర ప్రభాస్ లైవ్‌లోకి కీలకంగా రావడంతో పాటు ఎమోషనల్ యాంకర్‌గా నిలుస్తుందనే బజ్ ఉంది. అదే సమయంలో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, తరుణ్, మడోన్నా సెబాస్టియన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారని టాక్. ప్రతి పాత్రకూ వంగా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ భారీ చిత్రాన్ని భూషణ్ కుమార్ (టీ-సిరీస్) నిర్మిస్తున్నాడు. సంగీత బాధ్యతలు 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ చేపడుతున్నారు.

టీ-సిరీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్నఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో 5 ప్రధాన భారతీయ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్- వంగా కాంబినేషన్ మాత్రమే కాకుండా, స్టార్ స్టడెడ్ కాస్ట్, గ్రాండ్ స్కేల్ కారణంగా 'స్పిరిట్' ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే.. విలన్‌గా కొరియన్ యాక్షన్ ఐకాన్ మా డాంగ్-సియోక్ (డాన్ లీ) నటిస్తున్నారట. అయితే.. ఈ పాత్రపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఇంటర్నేషన్ స్టార్స్ ను ఈ సినిమాలో భాగం చేయాలని భావిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుని ఈ సినిమా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ చర్చనీయాంశమైంది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ 'స్పిరిట్'లో హై-ఇంపాక్ట్ స్పెషల్ కేమియో చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఒకే సీన్ అయినా అది సినిమాకి టర్నింగ్ పాయింట్ అవుతుందట. ఈ రూమర్ వెలుగులోకి రావడంతో ఇటు సౌత్ , అటు నార్త్ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది. ఇలా రోజుకో కొత్త బజ్ క్రియేట్ రాయడంతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డు బ్రేక్ కావడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X