రంగస్థలం స్టోరీ అదేనా, చిరంజీవి సినిమాలాగే..బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్రంలో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. స్టార్ హీరో ఈ తరహా పాత్రలో, కథలో నటించడం ఈ మధ్య కాలంలో జరగలేదు. చెర్రీ కెరీర్ లోనే చిట్టిబాబు పాత్ర ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో చరణ్ వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 30 న రంగస్థలం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్ర కథ గురించి ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. రంగస్థలం చిత్రం 1985 నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కబోతోంది. రంగస్థలం చిత్ర కథ గురించి తాజాగా జరుగుతున్న చర్చ చాలా ఆసక్తికరంగా ఉంది.

రంగస్థలంలో చిట్టిబాబు సందడి
రంగస్థలం అనే గ్రామంలో రాంచరణ్ చిట్టిబాబు అనే వినికిడి లోపం ఉన్న యువకుడిగా సందడి చేయనున్నాడు. చిట్టిబాబు సందడిని చూడాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.

సుకుమార్ చేయబోయే మాయ
సుకుమార్ తన విభిన్నమైన కథ, స్క్రీన్ ప్లే తో అభిమానులని ఎప్పడూ ఆశ్చర్యపరుస్తుంటాడు. రంగస్థలం చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి. సుకుమార్ ఈ చిత్రంలో ఎలాంటి కథ చెప్పబోతున్నాడు, 1985 నాటి పరిస్థితులని ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

రంగస్థలంలో రాజకీయం
రంగస్థలం చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. హీరో ఆది పినిశెట్టి ఈ చిత్రంలో చిట్టిబాబుకు అన్నగా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రంగస్థలం గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి, రాజకీయం వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రామలక్ష్మిగా సమంత
రంగస్థలం చిత్రంలో సమంత రామలక్ష్మి పాత్ర కూడా ఆసక్తి రేపుతోంది. పల్లెటూరి పేదింటి యువతిగా, అచ్చతెలుగు అమ్మాయిగా అందంగా కనిపించబోతోంది.

కథ గురించి ఆసక్తికర ప్రచారం
రంగస్థలం చిత్ర కథ గురించి మరో ఆసక్తికర ప్రచారం అభిమానుల్లో, చిత్ర పరిశ్రమలో మొదలైంది.రంగస్థలం చిత్ర కథకు ఆధారం మెగాస్టార్ చిరంజీవి నటించిన 80 వ దశకంలో ఓ చిత్రం అని వార్తలు వస్తున్నాయి.

ఊరికి ఇచ్చిన మాట
మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఊరికి ఇచ్చిన మాట 1981 లో విడుదలైంది. రంగస్థలం చిత్ర కథకు ఈ చిత్రమే ఆధారం అని వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ఊరికిచ్చిన మాట కథని రాంచరణ్ కు తగ్గట్లుగా మార్చినట్లు తెలుస్తోంది.అలాంటి కథతో రంగస్థలం రూపొంది ఉంటె రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











