Don't Miss!
- News
Tarakaratna: నందమూరి అభిమానులకు ప్రముఖుల మనవి, ఏం జరుగుతోంది, ఎప్పటికప్పుడు రిపోర్టు!
- Sports
WPL 2023: అమ్మాయిలకు ఆర్సీబీ బంపరాఫర్!
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
SSMB28: మహేశ్ తల్లిగా బ్యూటిఫుల్ హీరోయిన్.. గురూజీ సెలెక్షన్ అదిరిందిగా!
బడా హీరో కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు. దీనికితోడు మార్కెట్, ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకున్న అతడు.. వరుస సినిమాలతో సందడి చేస్తోన్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ స్టార్ హీరో హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.
నగ్నంగా చరణ్ హీరోయిన్: ప్రైవేటు భాగాలను అలా కవర్ చేస్తూ ఘోరంగా!
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఈ పార్ట్ మొత్తం సూపర్బ్‌గా వచ్చినట్లు తెలిసింది. ఇక, దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను జనవరి మొదటి వారం నుంచి మొదలెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ చక్కర్లు కొడుతోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని వైవిధ్యమైన కథతో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారట. ఇందులో భాగంగానే చాలా మంది వేరే ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ మూవీలో మహేశ్ బాబు తల్లిగా బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రాణి ముఖర్జీని తీసుకున్నట్లు తెలిసింది. ఎంతో హుందాగా ఉండే ఈ పాత్రకు ఆమె అయితేనే సెట్ అవుతుందని గురూజీ ఆమెను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది.
Keerthi Remuneration: జాక్‌పాట్ కొట్టిన కీర్తి భట్.. అందరి కంటే ఎక్కువ.. రెమ్యూనరేషన్‌తో రికార్డ్
క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు.