ఆ నిర్మాతతో హీరోయిన్ రహస్య వివాహం?
బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. కొత్త హీరోయిన్ల తాకిడితో ఈ భామ గ్లామర్‍కు డిమాండ్ లేక పోవడమే ఇందుకు కారణం. దీంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది ఈ బ్యూటీ. గత కొంత కాలంగా రాణి ముఖర్జీ ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాతో ప్రేమాయణం నడుపుతోంది. వీరు చాలా సందర్భంలో కలిసి తిరుగుతూ మీడియాకు చిక్కారు కూడా.
తాజాగా ఈ ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని కావాలనే రహస్యంగా ఉంచుతున్నారని, రాణి ముఖర్జీ రాబోయే సినిమా 'తలాష్' నేపథ్యంలో పెళ్లి విషయాన్ని కావాలని రహస్యంగా ఉంచుతున్నారని బాలీవుడ్ టాక్.
ఆదిత్య చోప్రా ప్రముఖ లెజండరీ ఫిల్మ్ మేకర్ యష్ చోప్రా తనయుడు. ఆదిత్య గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు పాయల్‌ను పెళ్లాడాడు. అయితే కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నారు. ఆదిత్య, రాణి మధ్య 'సం'బంధం ఉండటం వల్లనే పాయల్ విడాకులు తీసుకుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
రాణి ముఖర్జీ మాత్రం ఈ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడటానికే ఇష్ట పడటం లేదు. అటు ఆదిత్య కూడా నోటికితాళం వేసుకుని కూర్చున్నాడు. దీంతో ఈ వార్త నిజమే కావచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications












