»   » మన హీరోహీరోయిన్లలోనూ నిత్యానందులు, రంజితలు వున్నారా..!?

మన హీరోహీరోయిన్లలోనూ నిత్యానందులు, రంజితలు వున్నారా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాబా ముసుగులో నిత్యానంద స్వామి, సినీనటి రంజితతో నిత్యానందంలో మునిగితేలుతుండగా వారిని ఓ కెమెరాతో చిత్రీకరించి విడుదల చెయ్యడంతో అందరి దృష్టీ అటువైపు మల్లింది. ఇంతకు ముందు భువనేశ్వరి వ్యభిచారం చేస్తూ పట్టుబడటంతో ఆమె ఈ స్కాంలో ఎందరో ప్రముఖ నటీమణులు వున్నారని వారి పేర్లు బటయపెట్టడంతో ఆ వార్త సంచలనం సృష్టించింది. ఈ జాబితాలో పెళ్లయిపోయిన ముదురు భామలతో మొదలుకొని కొలీవుడ్ ను ఓ ఊపు ఊపుతున్న తారామణులు కూడా వుండటం విశేషం.

ఇక ఇప్పుడీ నిత్యానందుని శ్రీకృష్ణ లీలలతో మన సినీ ఇండస్ట్రీలో ఎంత మంది నిత్యానందులు, రంజితలు వున్నారనే ఆశక్తికర చర్చ టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఎవరో మచ్చుకు ఒకరిద్దరూ హీరోలను మినహాయిస్తే చాలా మటకు మన హీరోలందరూ నిత్యానందులే అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. ఇక కథానాయికలు కూడా స్టార్ ఇమేజీ వచ్చి అత్యధిక పారితోషికం పొంది విలాసవంతమయిన జీవితానికి అలవాటుపడి, ఒక్కసారిగా అవకాశాలు రాకపోవడంతో ఏం చెయ్యాలో తోచక విచ్చలివిడి తనానికి అలవాటు పడి వ్యభిచారాన్ని డబ్బు సంపాదించడానికి సులువైన మార్గంగా ఎన్నుకొని విశృంఖలత్వానికి అలవాటు పడుతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పరిశ్రమలోని కొందరు కీలక వ్యక్తులు.

ఇక హీరోలే కాకుండా కొందరు దర్శకనిర్మాతలు కూడా సినిమా ఆఫర్ ఇవ్వాలంటే తమ కోరికను తీర్చాలనే విపరీత కోర్కెలు కోరుతుండటం బహిరంగ రహస్యం. ఇటీవలే తెలుగులో ఇప్పుడిప్పుడే నాయికగా ఎదుగుతున్న మిస్ ఇండియా గద్దె సింధూర ఇదే విషయాన్ని తన స్నేహితులతో చెప్పి వాపోవడం ఈ విపరీతత్వానికి పరాకాష్ట. హీరోలు, దర్శకనిర్మాతలు మొదలుకొని కమెడియన్ ల వరకూ సినీపరిశ్రమలో ఎందరో నిత్యానందంతో మునుగుతూ, తేలుతున్న నిత్యానందులు ఎందరో, వారి కోసం ఎదురుచూస్తున్న రంజితలు కూడా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారనేది టాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X