వజ్రాల హారం, చీర గిఫ్టుగా ఇచ్చారు: దీపిక ఆ ఇంటి కోడలు కాబోతోందా?

By Bojja Kumar

Recommended Video

దీపిక బర్త్ డే కు ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఆ ?

బాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్లలో దీపిక పదుకోన్ ఒకరు. తన టాలెంటుతో అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్లో టాప్ పొజిషన్‌కు ఎదగడంతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకుంది ఈ కింగ్‌ఫిషర్ క్యాలెండర్ బ్యూటీ. ప్రేమ వ్యవహారాలు, సినిమా వివాదాలతో వార్తల్లో ఉండే దీపిక గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అది ఆమె పెళ్లి గురించిన వార్త కావడం గమనార్హం.

 రణవీర్ సింగ్

రణవీర్ సింగ్

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌తో దీపిక పదుకోన్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయాన్ని వారు ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రకటించక పోయినా ఇద్దరూ కలిసి పార్టీలు, ఫంక్షన్లకు హాజరు కావడం, చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ..... తమ ప్రేమ వ్యవహారం గురించి ఎప్పటికప్పుడు హింట్ ఇస్తూనే ఉన్నారు.

వారితో కలిసి శ్రీలంకలో పుట్టినరోజు వేడుక

వారితో కలిసి శ్రీలంకలో పుట్టినరోజు వేడుక

దీపిక పదుకోన్ జనవరి 5న పుట్టినరోజు వేడుక జరుపుకుంది. దీంతో ఆమె 32వ వసంతంలోకి అడుగు పెట్టింది. తన పుట్టినరోజు వేడుకను తన ప్రియుడు రణవీర్ సింగ్, అతడి ఫ్యామిలీతో కలిసి శ్రీలకంలో జరుపుకుందట.

 ఖరీదైన వజ్రాల హారం, చీర గిఫ్టుగా

ఖరీదైన వజ్రాల హారం, చీర గిఫ్టుగా

దీపిక పుట్టినరోజు సందర్భంగా రణవీర్ సింగ్ తల్లిదండ్రులు అంజు భవాని, జగ్జీత్ సింగ్ ఆమెకు ఖరీదైన వజ్రా హారం, సబ్యాసాచి సారీ గిఫ్టుగా ఇచ్చారట. దీంతో బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

 ఆ ఇంటి కోడలు కాబోతోందా?

ఆ ఇంటి కోడలు కాబోతోందా?

దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, తమకు కాబోయే కోడలు కాబట్టే రణవీర్ తల్లిదండ్రులు దీపికకు ఖరీదైన వజ్రాల హారం, చీర కానుకగా ఇచ్చారని అంటున్నారు. బయటి వ్యక్తులకు ఎవరూ ఇలాంటి గిఫ్టులు ఇవ్వరని అంటున్నారు.

ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిపోయిందా?

ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిపోయిందా?

శ్రీలంకలో జరిగిన దీపిక పదుకోన్ పుట్టినరోజు వేడుకలోనే దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ అనధికారిక నిశ్చితార్థం జరిగినట్లు, ఇద్దరూ రింగులు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత? అనేది తేలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X