రణవీర్ సింగ్‌ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా? ప్రభాస్, షారుక్, బన్నీ రికార్డులు బ్రేక్!

Ranveer Singh remuneration: సినిమా ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ప్రతిసారి ఏదొక కొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. ఒకప్పుడు కోటి రూపాయల పారితోషికం తీసుకోవడమే అదొక సంచలనం. మెగాస్టార్ చిరంజీవి 'ఆపద్బాంధవుడు' సినిమాకు కోటికిపైగా పారితోషికం తీసుకున్నాడు. అప్పటి వరకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా అందుకోని స్థాయిలో ఒక ప్రాంతీయ భాషా హీరో భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నాడంటూ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో చిరంజీవిపై ప్రత్యేక కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అలాగే.. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. ఈ హీరో ఎవరూ ఊహించని స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నారంట. ఇంతకీ ఏన్ని కోట్లంటే?

భారతీయ సినిమా మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల హవా మొదలైన తర్వాత హీరోల మార్కెట్ విలువలు అమాంతం పెరిగిపోయాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ప్రభాస్, అల్లు అర్జున్, యశ్ వంటి స్టార్ హీరోలు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అలాగే.. సినిమా లాభాల్లో కూడా భారీ మొత్తం వాటాలు పొందుతున్నారు. ఇప్పడూ ఈ లెక్కలన్నింటినీ మార్చేస్తూ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కొత్త రికార్డును నెలకొల్పినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Ranveer Singh Beats Prabhas Rajinikanth allu arjun and Shah Rukh With Massive Remuneration

'ధురంధర్' పేరుతో రూపొందిన భారీ యాక్షన్ ఫ్రాంచైజీ ఇండస్ట్రీలో రికార్డులను తిరగరాయడమే కాకుండా రణవీర్ సింగ్ కెరీర్‌లో కూడా ఓ మైల్ స్టోన్ మూవీగా మారిపోయింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3,200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్దే రూ.1,900 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో రణవీర్ సింగ్ మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ తరుణంలో రణవీర్ పారితోషికంగా కూడా చర్చనీయంగా మారింది. ఈ సినిమా కోసం ఏకంగా 325 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన ముందస్తుగా పారితోషికం తీసుకోకుండా, లాభాల్లో వాటా తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా నిర్మాణ సమయంలో స్వయంగా పెట్టుబడులు కూడా పెట్టడంతో, సినిమా విజయవంతం కావడంతో వచ్చిన లాభాల్లో ఆయన వాటా భారీగా పెరిగింది. థియేట్రికల్ ఆదాయం, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజికల్ రైట్స్ ద్వారా రణవీర్ కు రూ.325 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోల జాబితాలో రజనీకాంత్, షారుక్ ఖాన్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లు ముందంజలో ఉన్నారు. 'జైలర్' సినిమాకు రజనీకాంత్ సుమారు రూ.250 కోట్లు, 'జవాన్', 'పఠాన్' సినిమాలకు షారుక్ ఖాన్ సుమారు రూ.200 కోట్లకు పైగా, 'పుష్ప-2'కు అల్లు అర్జున్ రూ. 200 కోట్లు , కల్కి 2898 AD కి ప్రభాస్ కూడా రూ.200 కోట్లకు పైగా అందుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.ఇప్పటి వారందరి రికార్డులను బ్రేక్ చేసి, రణవీర్ సింగ్ అగ్రస్థానంలో నిలిచారనే చెప్పాలి.

అయితే రణవీర్ సింగ్ రూ.325 కోట్ల రెమ్యూనరేషన్ పై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ట్రేడ్ వర్గాల అంచనాలు, మీడియా కథనాల ఆధారంగానే ఈ రెమ్యూనరేషన్ విషయం ప్రచారంలో ఉంది. ఏదిఏమైనా 'ధురంధర్' ఫ్రాంచైజీతో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మార్కెట్ భారీస్థాయిలో పెరిగిందనడంతో ఎలాంటి సందేహం లేదు. ఈ సక్సెస్ తరువాత ఆయన అప్ కమ్మింగ్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more about: ranveer singh allu arjun prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X