రణవీర్ సింగ్-దీపిక పెళ్లి చేసుకోబోతున్నారా?

By Bojja Kumar

ముంబై: రణబీర్ కపూర్‌తో ప్రేమ పెటాకులైన తర్వాత....బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకోన్ మరో యంగ్ స్టార్ రణవీర్ సింగుతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి.

ఈ వార్తలకు కారణం ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే. ప్రస్తుతం రణవీర్, దీపికలు ప్రేమలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియురాలు ఎక్కడ వుంటే అక్కడే తనకు న్యూ ఇయర్ అన్నట్లుగా దీపిక కోసం రణవీర్ మాల్దీవులకు వెళ్లి ఆమెతో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ వెకేషన్లో దీపిక కుటుంబ సభ్యులు ఉండటం, వారితో రణవీర్ సింగ్ కూడా జాయిన్ అవ్వడం బట్టి చూస్తే ఇద్దరి మధ్య రిలేషన్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Ranveer Singh, Deepika Padukone to marry soon?

ఇటీవల బెంగుళూరులో దీపిక పుట్టినరోజు వేడుకల్లో కూడా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రణవీర్ పాల్గొన్నాడని, ఇద్దరి మధ్య మధ్య ప్రేమ ముదిరి పెళ్లి దిశగా వారి బంధం సాగుతుందని అంటున్నారు. దీపిక వయసు కూడా 30కి దగ్గరవుతుండటంతో పెళ్లి చేసుకుని పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్ లీలా' చిత్రం ద్వారా దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య హాట్ అండ్ సెక్సీ శృంగార సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆకర్షణ పెంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X