Ranveer Singh: ధురంధర్ హీరో నెక్ట్స్ మూవీ ఫిక్స్.. క్రేజీ బ్యూటీ జోడీ కట్టనుండా?

Ranveer Singh Next Movie: బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్.. మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిపోయారు. తాజాగా ధురంధర్ 1, ధురంధర్ 2 సినిమా సక్సెస్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. రూ.1000 కోట్లకుపైగా కలెక్షన్లు అందుకుని పుల్ జోష్ లో దూసుకెళ్తున్నారు. ఇలా రికార్డు విజయం తర్వాత,రణ్‌వీర్ తదుపరి సినిమా ఏంటీ? అని ఇండస్ట్రీలోనే కాదు, అభిమానుల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 'ధురంధర్ 2' మాసివ్ సక్సెస్ తరువాత రణవీర్ మార్కెట్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో అతను ఎలాంటి కథను ఎంచుకుంటాడో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహత దూసుకెళ్తుంది. విడుదలైన ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. రోజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ.. విడుదలైన కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1,088 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, అత్యధిక వేగంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన సినిమాగా సంచలనం సృష్టించింది. ఈ రికార్డ్ రన్‌లో భాగంగా, ఇప్పటి వరకు ఉన్న పలు భారీ సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను కూడా అధిగమించడం విశేషం.

Ranveer Singh Next Movie Pralay Zombie Thriller with Kalyani Priyadarshan After Dhurandhar 2

ప్రత్యేకంగా.. షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్', ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 AD' వంటి బిగ్ టికెట్ సినిమాల రికార్డులను ఈ సినిమా చెరిపేసిందనే ట్రేడ్ వర్గాల విశ్లేషణ. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, భారతీయ మార్కెట్‌లోనే దాదాపు రూ. 690 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసి, అద్భుతమైన స్ట్రాంగ్ రన్‌ను కొనసాగిస్తోంది. హిందీతో పాటు విడుదలైన తెలుగు వెర్షన్‌లో కూడా 'ధురంధర్ 2' భారీ వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఈ విజయంతో రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద హిట్‌గా నిలవడమే కాకుండా, బాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో కూడా సరికొత్త రికార్డులను సెట్ చేసింది.

ఈ క్రమంలో, రణవీర్ సింగ్ తన తదుపరి సినిమాగా ఒక హై-కాన్సెప్ట్ జాంబీ యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడని బీటౌన్‌ టాక్. ఈ సినిమాకు 'ప్రళయ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ మూవీకి యువ దర్శకుడు జై మెహతా తెరకెక్కించనున్నాడని టాక్. ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, అసిస్టెంట్ డైరెక్షన్‌లో పనిచేసిన జై మెహతా, ఈ సినిమాతో థియేట్రికల్ డెబ్యూ చేయబోతున్నాడు.

ఈ మూవీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది సాధారణ జాంబీ కథ కాదు. కోవిడ్ మహమ్మారి తర్వాతి ప్రపంచాన్ని ఆధారంగా తీసుకుని, ఒక డిస్టోపియన్ ముంబైలో జరిగే కథగా రూపొందిస్తున్నారని సమాచారం. వైరస్ కారణంగా మనుషులు జాంబీలుగా మారిపోతారు. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఒక కుటుంబం ఎలా బ్రతికేందుకు పోరాడుతుంది? వారి మధ్య ఉన్న బంధాలు, భావోద్వేగాలు ఎలా పరీక్షకు గురవుతాయి? అనే అంశాలతో కథ నడుస్తుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు, భావోద్వేగాలకు కూడా సినిమాలో పెద్దపీట వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా VFX, ప్రొడక్షన్ డిజైన్‌పై భారీగా ఖర్చు పెట్టి, హాలీవుడ్ స్థాయిలో జాంబీ అపోకలిప్స్‌ను తెరపై చూపించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రణవీర్ సింగ్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తి చూపుతూ, స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతి దశలో భాగస్వామ్యం అవుతున్నాడని సమాచారం. ఇది అతని కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సోలో ప్రాజెక్ట్ కావొచ్చు.

ఇక హీరోయిన్ విషయానికి వస్తే, ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)పేరు బలంగా వినిపిస్తోంది. మలయాళంలో మంచి గుర్తింపు పొందిన ఈ నటి, ఈ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాలో ఆమె రణవీర్ భార్య పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ జంట స్క్రీన్‌పై కొత్తగా కనిపించబోతోందనే కారణంతో కూడా సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

మరోవైపు, రణవీర్ సింగ్ చేయాల్సిన డాన్ 3 (Don 3)ప్రాజెక్ట్‌పై అనిశ్చితి నెలకొంది. దర్శకుడు ఫరాన్ అక్తర్ (Farhan Akhtar)తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో రణవీర్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నా, 'ప్రలయ' లాంటి కొత్త జానర్ ప్రాజెక్ట్ అతనిపై అంచనాలను మళ్లీ పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X