షాకింగ్ : ప్రభాస్, రణవీర్ సింగ్ భారీ మల్టీస్టారర్.. నిర్మాత అతడే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై జాతీయ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఏడాది కాలంగా సాహో చిత్రం షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. దీనితో ప్రభాస్ తదుపరి చిత్రాలపై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజగా బాలీవుడ్ మీడియాలో జరుగుత ప్రచారం ఆశ్చర్యకరంగా ఉంది.

రణవీర్ సింగ్, ప్రభాస్ కలసి
రణవీర్ సింగ్, ప్రభాస్ హీరోలుగా బాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాహుబలి తరువాత దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజీ హీరోగా మారిపోయాడు.

నిర్మాత అతడే
బాహుబలి చిత్రాన్ని బాలీవుడ్ లో విడుదల చేసిన కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాహుబలి చిత్రానికి అంతటి ఆదరణ బాలీవుడ్ లో దక్కిందంటే అందులో కరణ్ జోహార్ పాత్ర మరువలేనిది.

ఎప్పటి నుంచో
ప్రభాస్ తో నేరుగా ఓ బాలీవుడ్ చిత్రం చేయాలని కరణ్ జోహార్ భావిస్తున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ వెంటనే సాహూ చిత్రంతో బిజీ అయిపోయాడు. ఈ చిత్రం తరువాత రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రణవీర్ సింగ్ తో మల్టీస్టారర్ చిత్ర వార్త ఆసక్తి రేపుతోంది.

అధికారికంగా
సాహో సినిమానే ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. దీనితో అప్పుడే ప్రభాస్ తదుపరి చిట్యాల గురించి ఓ నిర్ణయానికి రాలేం. కరణ్ జోహార్ నుంచి కూడా మల్టీస్టారర్ చిత్ర విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











