అడ్డదారి పట్టిన సోనాక్షి-రణవీర్ సింగ్?
బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తమ అదృష్టాన్ని పరీ్క్షించుకుంటున్న సోనాక్షి సిన్హా, రణవీర్ సింగ్ బాలీవుడ్‌లో హాట్ జంటగా మారబోతున్నారు. గతంలో చాలా జంటలు తెర వెనక 'సం"బంధాలు నడిపిస్తూ తద్వారా వార్తల్లోకి ఎక్కి... తెరపై తలతల మెరిసి పోతున్న సంగతి తెలిసిందే. గతంలో బిపాస-జాన్ అబ్రహం, ఇటీవల దీపిక-రణబీర్ కపూర్ ఇలా చాలా మంది లవ్ ఎపైర్ నడిపిస్తూ తెరపై తమ హవా కొనసాగించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి రూటును సినిమా ఫీల్డ్‌లో పాపులర్ కావడానికి అడ్డదారిగా సీని విశ్లేషకులు పేర్కొంటూ ఉంటారు. తాజాగా ఇలాంటి అడ్డదారిలో ప్రయాణించడానికి సిద్ధం అయ్యారు సోనాక్షి, రణవీర్.
అయితే ఇటీవల బ్యాండ్ బజా భారత్ లో రణవీర్-అనుష్క శర్మలు కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఘాటైన ముద్దు సీన్లు కూడా ఉన్నాయి. సినిమా అనంతరం కూడా వీరు క్లోజ్ గా మెలుగుతుండటంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు వచ్చాయి. అయితే సోనాక్షి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా రణవీర్ నాకే సొంతం అనే విధంగా మాట్లాడుతోందట. రణవీర్ కూడా సోనాక్షితో 'సం"బంధం నడిపించడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తూంది. అదే జరిగితే బాలీవుడ్ లో మరో హాట్ పెయిర్ తరచూ వార్తల్లో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











