Viswambhara: చిరంజీవికి ఆయన విలనా? విశ్వంభరలో మెయిన్ ట్విస్ట్ లీక్

గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలు అందురూ ఎంతో వేగంగా సినిమాలు చేస్తున్నారు. అందులోనూ భారీ అండ్ క్రేజీ ప్రాజెక్టులను చేస్తూ తమ రేంజ్‌ను మరింతగా పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌లో కనిపిస్తోన్న ఆయన.. ఇప్పుడు 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీని చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కోసం మూవీ యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

Rao Ramesh to Play Key Role in Chiranjeevi Starrer Viswambhara Movie

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలయికలో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక, ఇప్పుడు చిరంజీవి, త్రిషతో పాటు మెయిల్ ఆర్టిస్టులతో హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో షూట్ చేస్తున్నారు.

విజువల్ వండర్‌గా రాబోతున్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర కోసం ఓ స్టార్‌ను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

Rao Ramesh to Play Key Role in Chiranjeevi Starrer Viswambhara Movie

హై రేంజ్ గ్రాఫిక్స్‌తో రాబోతున్న 'విశ్వంభర' మూవీలో ప్రముఖ విలక్షణ నటుడు రావు రమేష్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. త్వరలోనే ఆయన ఈ మూవీ షూట్‌లో పాల్గొనబోతున్నారని అంటున్నారు. ఇక, రావు రమేష్ విలన్ అని తెలిసే సీన్ సినిమాలో వచ్చే మెయిన్ ట్విస్ట్ అని కూడా తాజాగా సమాచారం బయటకు వచ్చేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబోలో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X