అదిరిపోయేలా హీరో, దర్శకుల కలయిక.. టాలీవుడ్‌లో సెన్సేషనల్ కాంబినేషన్స్

By Rajababu

Recommended Video

హీరో, దర్శకుల కలయిక.. సెన్సేషనల్ కాంబినేషన్స్

బాహుబలి తర్వాత టాలీవుడ్ ప్రతిష్ఠ అమాంతం పెరుగడంతో ఇప్పడు తెలుగు సినిమాల మార్కెట్ జాతీయస్థాయిలో ఘనంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు టాలీవుడ్ ప్రముఖ హీరో, దర్శకులు. ఈ క్రమంలో రేర్ కాంబినేషన్లకు తెరలు లేస్తున్నాయి. ఇప్పుడు కొరటాల, శివతో మహేశ్ సినిమా, సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్‌లో సెట్‌పైన ఉన్నాయి. ఇక త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఇలాంటి కాంబినేషన్ల నేపథ్యంలో మరి కొన్ని క్రేజీ కాంబినేషన్లు సిద్ధమవుతున్నాయి.

 అల్లు అర్జున్‌తో కొరటాల శివ

అల్లు అర్జున్‌తో కొరటాల శివ

శ్రీమంతుడు సినిమాకు ముందే అల్లు అర్జున్‌ కోసం కొరటాల శివ స్క్రిప్టు సిద్ధం చేశాడట. కథను కూడా స్టైలిష్ స్టార్‌కు వినిపించాడట. అయితే ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదట. మళ్లీ ఈ మధ్య అల్లు అర్జున్‌కు కొరటాల శివ ఓ విభిన్నమైన కథను వినిపించడం, ఆ చిత్రాన్ని నిర్మించడానికి దిల్ రాజు ముందుకు రావడం జరిగిందట. త్వరలోనే అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ వస్తుందని సినీ వర్గాల సమాచారం.

 రాంచరణ్‌తో బోయపాటి శ్రీను

రాంచరణ్‌తో బోయపాటి శ్రీను

దర్శకుడు సుకుమార్‌తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రంగస్థలం చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత రాంచరణ్ నటించబోయే సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రం అని ఫిలింనగర్ టాక్. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో సినిమా ప్రారంభించి వచ్చే దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారనేది తాజా సమాచారం.

 కొరటాల శివతో అఖిల్

కొరటాల శివతో అఖిల్

వాస్తవానికి కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా అనుకొన్నారు. ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో అది వెనక్కు వెళ్లినట్టు సమాచారం. ఎన్టీఆర్‌తో సినిమాపై క్లారిటీ లేకపోవడం వల్ల అక్కినేని అఖిల్‌తో కొరటాల శివ జతకట్టనున్నారనేది లేటేస్ట్ న్యూస్. విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న హాలో చిత్రం తర్వాత అఖిల్ చేయబోయే సినిమా అదే అంటున్నారు. హీరోల రేంజ్‌ను బాగా ఎలివేట్ చేసే కెపాసిటీ ఉన్న దర్శకుడు కొరటాల చేతిలో అఖిల్ పడితే మాస్ హీరోగా రేంజ్ పెరుగడం ఖాయం.

 రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి

రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఓ సెన్సేషనల్ మల్టీ స్టారర్‌కు రెడీ అవుతున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కనున్నది. గతవారమే ఈ ముగ్గురు కలిసిన ఫొటో మీడియాలో వైరల్ అయింది. రాజమౌళి నిర్మించబోయే సినిమా ఎమోషనల్ కంటెంట్‌తోపాటు, యాక్షన్‌కు ఆస్కారం ఉన్న చిత్రంగా ఉంటుందట.

 సాయిధరమ్‌తో వినాయక్

సాయిధరమ్‌తో వినాయక్

ఇక మెగా కాంపౌండ్ చాలా ఇష్టమైన దర్శకుల్లో వీవీ వినాయక్ ఒకరు. చిరంజీవితో ఠాగూర్, రాంచరణ్‌తో నాయక్ సినిమా రూపొందించాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో వినాయక్ సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ ‌గురించి కూడా ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది.

 రాజమౌళితో మహేశ్‌బాబు

రాజమౌళితో మహేశ్‌బాబు

రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య కాంబినేషనల్‌లో వచ్చే ఎన్టీఆర్, రాంచరణ్‌ సినిమా తర్వాత జక్కన చేయబోయే సినిమా ప్రిన్స్ మహేశ్‌బాబుతో కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ కథపై కసరత్తు జరుగుతున్నదట. కమర్షియల్ అంశాలన్నీ కలిపి తీయబోయే సినిమా కోసం స్క్రిప్టు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X