మెగా హీరో సరసన రాశీ ఖన్నా.. కన్ఫర్మ్!

Recommended Video

Rashi Khanna To Romance With Mega Hero In Maruthi Direction || Filmibeat Telugu

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన రాశీ ఖన్నా నటించబోతోంది తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీమ్ సినిమాలో నటించి భేష్ అనిపించుకున్న ఈ జంట మరోసారి జోడీ కట్టనున్నారని సమాచారం. సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో రాశీ ఖన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత కొంత కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా ట్రాక్ ఎక్కాలని భావించిన ఆయన డైరెక్టర్ మారుతి చేతికి తన కొత్త సినిమా బాధ్యతను అప్పగించాడు. ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మామ మెగాస్టార్ చిరంజీవి కూడా పరిశీలించి ఓకే చేశారు. దీంతో చిత్రాన్ని అన్ని హంగులు జోడించి చిరంజీవి అంచనాలను ఏ మాత్రం వమ్ము చేయకూడదని భావిస్తున్నాడట డైరెక్టర్ మారుతి.

Rashi Khanna confirmed in Sai Dharam Tejs upcoming project

ఈ మేరకు సినిమా నటీనటుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడట. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉండటంతో మెయిన్ హీరోయిన్‌గా రాశీ ఖన్నాను తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడట మారుతి. గతంలో సాయి ధరమ్, రాశీ ఖన్నా జోడీ సక్సెస్ అయింది కాబట్టి ఈ జోడీ ద్వారా చిత్రానికి వెయిటేజ్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్. ఇక మరో హీరోయిన్‌గా మాళవిక శర్మ, రుక్సార్ థిల్లాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. చిత్రానికి 'భోగి' అనే ఆసక్తికర టైటిల్ కన్ఫర్మ్ చేశారని సమాచారం.

ఈ క్రేజీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2- యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని, ఖచ్చితంగా ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుందని చెప్పుకుంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X