అఖిల్‌కు జోడీగా రాశి ఖన్నా...ఫైనల్ అయిందా?
హైదరాబాద్: అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ తెరంగ్రేటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెలిగొండ శ్రీనివాస్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున,ఎన్. సుధాకర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించబోతున్నట్లు టాక్.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో కథానాయికగా తెలుగు తెరపై అడుగుపెట్టిన రాశిఖన్నా అఖిల్ సరసన నటించబోందని అంటున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒకరు రాశి ఖన్నా అని అంటున్నారు.

అసలు...వాస్తవానికి ఇంకా అఖిల్ సినిమా ఖరారు కానేలేదు. ఇదంతా ఫిల్మ్ నగర్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అఖిల్ లేదా నాగార్జున స్వయంగా ప్రకటిస్తే తప్ప అతడి తొలి చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. డైరెక్టర్, హీరోయిన్, కథ రచయిత ఇలా ప్రతి విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
అకిల్ సినిమాను తానే నిర్మిస్తానని నాగార్జున గతంలోనే వెల్లడించారు. తన పెద్ద కొడుకు నాగ చైతన్య తొలి సినిమా ‘జోష్' ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడం నాగ చైతన్య కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. మళ్లీ ఆ పొరపాటు జరుగకుండా, అఖిల్ తొలి సినిమానే హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగార్జున.


Click it and Unblock the Notifications











