రాశిఖన్నా స్కెచ్.. ఇకపై ముంబైలో!
తెలుగు ప్రేక్షకులకు అందాల విందిస్తూ స్టార్ హీరోయిన్ స్థాయిలో క్రేజ్ కొట్టేసింది రాశి ఖన్నా. కెరీర్ ఆరంభం నుంచే ఆకట్టుకుంటూ వస్తున్న ఈ భామ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా మెల్లగా కెరీర్ నెట్టుకొస్తూ సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్న ఈమె ఇక ముంబైలో మకాం పెట్టేయాలని ఫిక్స్ అయిందట.
ఇటీవలే గచ్చిబౌలీలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన రాశీ ఖన్నా, ఇక ముంబై వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ లలో అవకాశాలు దక్కించుకుంటున్న రాశి.. ముంబైకి మకాం మార్చి బాలీవుడ్ సినిమాల్లో కూడా రాణించాలని భావిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ మేరకు ఇప్పటికే గచ్చిబౌలిలో ఉన్న తన ఇంటిని కూడా రెంట్‌కి ఇచ్చేసిందని అంటున్నారు.

ముంబైలో గట్టి ప్రయత్నాలు చేస్తూ, దక్షిణాది నుంచి వచ్చే అవకాశాలను కూడా అందుకుంటూ వెళ్లాలని రాశిఖన్నా డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక రాశిఖన్నా సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన వెంకీమామ సినిమా ఈ రోజే (డిసెంబర్ 13న) విడుదలైంది. మరోవైపు విజయ్ దేవరకొండ సరసన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కూడా నటిస్తోంది రాశిఖన్నా. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











