మహాసముద్రంలోకి ఎంటర్ అవుతున్న రాశీఖన్నా.. ఇదే జరిగితే!
ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిసాస్టర్ తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం సెలెక్టెడ్ సినిమాలకే కమిట్ అవుతూ కెరీర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే రవితేజ హీరోగా Rx 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనికి మహాసముద్రం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. కాగా తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదట ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ గా అదితి రావు హైదరీ అనుకున్నప్పటికీ.. చివరకు రాశీఖన్నాను ఫైనల్ చేశారని తెలుస్తోంది.

ఇదే జరిగితే మాస్ మహారాజా రవితేజ, రాశీఖన్నా ముచ్చటగా మూడోసారి జత జతకట్టినట్లు అవుతుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు సినిమాల్లో జోడీ కట్టారు. ప్రస్తుతం రాశి ఖన్నా నాగచైతన్య జోడీగా వెంకీమామ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే స్లిమ్ లుక్ లోకి మారిన ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో మరో సినిమాలో కూడా అవకాశం పట్టేసింది.


Click it and Unblock the Notifications











