ఓంకార్ గదిలో యాంకర్ రష్మీ..! ఆ ముగ్గురితో పాటు అమ్మడి పేరు కూడా బయటకొచ్చింది
బుల్లితెర యాంకర్‌గా ఆడియన్స్‌కి దగ్గరైన ఓంకార్ ఆ తర్వాత మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. డిఫెరెంట్ జోనర్‌లో హారర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో 'రాజుగారి గది' సినిమా రూపొందించాడు. ఓంకార్ భావించినట్లు గానే ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వల్ ప్లాన్ చేస్తూ వస్తున్నాడు ఓంకార్.

రెండో గదిలో నాగార్జున, సమంత
'రాజుగారి గది' సక్సెస్ తర్వాత 'రాజుగారి గది 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ఓంకార్. ఈ సినిమాలో నాగార్జున, సమంత లీడ్ రోల్స్ పోషించారు. మొదటి భాగానికి వచ్చిన ఆదరణ ఈ సినిమాకు రానప్పటికీ ఫర్వాలేదనిపించుకుంది. దీంతో ఇక మూడో భాగానికి శ్రీకారం చుడుతూ ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా ఫినిష్ చేశాడు ఓంకార్.

తమన్నా, కాజల్ అనుకున్నాడు కానీ
'రాజుగారి గది 3' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మొదట మిల్కీ బ్యూటీ తమన్నా, అశ్విన్ లను లీడ్ రోల్స్‌లో సెలెక్ట్ చేశారు. కానీ పాత్ర పరిధి దృష్ట్యా పూజా కార్యక్రమాల అనంతరం తమన్నా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుతుంది. దీంతో మారో హీరోయిన్ వేట పారంభించిన ఓంకార్ కాజల్ ని లైన్ లోకి తీసుకొచ్చాడు. కానీ రెమ్మ్యూనరేషన్ కారణంగా ఆమె కూడా నో చెప్పింది. దీంతో ఫైనల్ గా అవికాగోర్‌ను తీసుకునే ఆలోచనలో పడ్డాడు ఓంకార్.

ఓంకార్ గదిలో రష్మీ
తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు 'రాజుగారి గది 3' మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉందట. దీంతో ఈ క్యారెక్టర్ లో యాంకర్ రష్మీ అయితే బాగా సూట్ అవుతుందని భావించిన ఓంకార్ ఆమెనే ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఈ మేరకు రష్మీని కాంటాక్ట్ కూడా అయ్యాడని ఫిలింనగర్ టాక్. ఇదే నిజమైతే రష్మి గౌతమ్ మరోసారి హారర్ కామెడీ చిత్రంతో దగ్గర కానుండటం ఖాయం.

'రాజుగారి గది 3' మూవీ
ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓంకార్ దర్శకత్వంలో 'రాజుగారి గది 3' మూవీ తెరకెక్కనుంది. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్‌ఘోష్ తదితరులు నటించనున్నారు. చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











