For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాస్తవం గ్రహించిన రష్మీ గౌతమ్.. పక్కచూపులు మాని.. ఇక ఫుల్ ఫోకస్ దానిమీదే..

  |

  తెలుగువారిలో యాంకర్ రష్మీ అంటే తెలియని వారు ఉండరేమో ?. ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో అంతగా పేరు సంపాదించింది. ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ షో లు చేస్తోంది. ఇవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ భామ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉండేది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి లక్ పరీక్షించుకుంది. అయితే ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మి కీలక నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే ?

  అందాలు ఆరబోసినా వర్కౌట్ కాలేదు

  అందాలు ఆరబోసినా వర్కౌట్ కాలేదు

  నిజానికి రష్మీ వెండితెర మీద నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కంటే గ్లామర్ షో, అందాల ఆరబోతకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ అలాంటి పాత్రలు ఎంచుకునేది. బహుశా అలాంటి పాత్రలు చేస్తే మరింత క్రేజ్ లభిస్తుందని భావించేది ఏమో, కానీ ఆమె ఎంత అందాలు ఆరబోసినా సరే ప్రేక్షకులు బుల్లితెర మీద ఆదరించిన అంత బాగా వెండితెర మీద ఆదరించలేదు.. సినిమాల్లో ఈ భామకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఫలితం కూడా దక్కలేదు పోయింది.

  సోషల్ మీడియాలో యమా క్రేజ్

  సోషల్ మీడియాలో యమా క్రేజ్

  కానీ ఈ భామ బుల్లితెర మీద కనిపిస్తే మాత్రం ప్రేక్షకులు పట్టం కట్టేశారు. ఆమె ఉన్న అన్ని వీడియోలు, ఆమె చేస్తున్న అన్ని షోలకు మంచి టి ఆర్ పి లు వస్తూ ఉంటాయి. అదేమి చిత్రమో ఈ భామకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కేవలం తన హాట్ హాట్ ఫోటోలు అప్లోడ్ చేయడమే కాక తనలోని సామాజిక కోణాన్ని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ ఉంటుంది. అందుకే ఈ భామకు సోషల్ మీడియాలో క్రేజ్ బాగానే ఉంది.

  పూర్తిగా ఆపేయాలని

  పూర్తిగా ఆపేయాలని


  ఇంతకీ విషయం ఏమిటంటే తనకు కలిసిరాని సినిమా రంగాన్ని పూర్తిగా పక్కనపెట్టేయాలని ఈ భామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏదైనా సినిమా ఆఫర్స్ వస్తే తన టీవీ ప్రోగ్రామ్స్ షూటింగ్ షెడ్యూల్ మొత్తం రీ అరేంజ్ చేయాల్సి వస్తోంది అట. అంతా చేసి సినిమా రిలీజ్ అయినా సరే తనకు మాత్రం అనుకున్నంత గుర్తింపు దక్కడం లేదని ఆమె బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఇక మీదట సినిమాల్లో భారీ ఆఫర్లు వస్తే తప్ప చిన్న చిన్న పాత్రలు, చిన్న సినిమాలు చేయకూడదు అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

  మరిన్ని షోలు చేస్తూ

  మరిన్ని షోలు చేస్తూ


  ప్రస్తుతానికి టీవీ షోస్ మీద వస్తున్న ఆదాయం బాగానే ఉండటం, క్రేజ్ కూడా సినిమాల కంటే ఇక్కడే ఎక్కువ లభిస్తుండడంతో రష్మీ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.. సినిమాల మీద ఆమె పెడుతున్న ఫోకస్ తీసేసి మరిన్ని షోస్ ఒప్పుకుని నాలుగు రాళ్ళు ఇప్పుడే వెనకేసుకోవాలని ఆమె భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.

  సుధీర్ కి పట్టిన దరిద్రం

  సుధీర్ కి పట్టిన దరిద్రం


  ఇక తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా రశ్మీ మీద పొట్టి నరేష్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ స్కిట్ లో సుధీర్ ను హీరోగా చూపిస్తూ సుధీర్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని చూస్తున్నా సరే సుధీర్ మాత్రం ఇక్కడే ఉండి పోయాడు అని దానికి కారణం ఆయనకు పట్టిన దరిద్రం రష్మి అని కామెంట్ చేశాడు నరేష్. అయితే ముందు షాక్ అయినా సరే అది స్క్రిప్ట్ లో భాగం అని గుర్తించి వెంటనే మరో కౌంటర్ వేసింది రష్మీ.

  English summary
  Among Telugu TV stars, Anasuya is the only one who is getting big cinema projects. On the other hand, Rashmi Gautam who played heroine roles in several films a couple of years ago is seeing at dry offers. Sources say Rashmi Gautam has given up hope on reviving her film career. She is happily doing her TV assignments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X