అడల్ట్ టచ్‌ ఇవ్వనున్న రష్మీ గౌతమ్.. పైకం కూడా ఎక్కువేనట!

Recommended Video

Rashmi Gautam To Tease Audience In Web Series || Filmibeat Telugu

బుల్లితెర, వెండితెర ఆడియన్స్‌‌కి సుపరిచితమైన పేరు రష్మీ గౌతమ్. ఈ పేరు వింటేనేలో అందరిలో కిక్కు. గ్లామర్‌తో ముద్దు ముద్దు మాటలతో అలరించే ఈమె బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా రష్మీకి అంతులేని ఫాలోయింగ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా తెచ్చుకున్న గుర్తింపుకు తోడు వెండితెరపై కాలుమోపి పలు సినిమాల్లో నటించింది రష్మీ. కానీ వెండితెరపై ఇప్పటిదాకా ఆశించిన ఫలితం మాత్రం రాబట్టలేక పోయింది. దీంతో ఈ అమ్మడు తన ప్రయాణాన్ని డిజిటల్ రంగం వైపు మళ్లించింది. వివరాల్లోకి పోతే..

 రామ్ గోపాల్ వర్మ, కియారా అద్వానీ అడుగులు

రామ్ గోపాల్ వర్మ, కియారా అద్వానీ అడుగులు

ఈ రోజుల్లో డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తుండటం కారణంగా పలువురు సెలెబ్రిటీలు ఈ వైపుగా ఆలోచిస్తున్నారు. వెబ్ సిరీస్‌ల ద్వారా ట్రెండ్ ని క్యాచ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ, కియారా అద్వానీ లాంటి తారలు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై ఇప్పటికే అడుగు పెట్టేశారు కూడా.

డైరెక్టర్ చెప్పగానే.. రష్మీ

డైరెక్టర్ చెప్పగానే.. రష్మీ

'ఎ ఫిల్మ్ బై అరవింద్' దర్శకుడు శేఖర్ సూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ ద్వారా రష్మీ డిజిటల్ రంగంలో అడుగుపెడుతోంది. ఈ వెబ్ సిరీస్ కంటెంట్ అమితంగా నచ్చడంతో రష్మీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అతి త్వరలో ఈ వెబ్ సిరీస్ ఇంటర్నెట్ వేదికపై అలరించనుందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌కి సంబందించిన మరో విశేషమేమిటంటే.. సీనియర్ నటుడు శ్రీకాంత్, సత్యదేవ్ కూడా ఈ వెబ్ సిరీస్‌లో భాగం కానుండటం.

అడల్ట్ టచ్‌.. పైకం కూడా ఎక్కువే

అడల్ట్ టచ్‌.. పైకం కూడా ఎక్కువే

ఈ వెబ్ సిరీస్ లో అడల్ట్ టచ్‌ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అందులో రష్మీ నెటిజన్లకు సెగలు పుట్టించే రోల్ రష్మీ చేస్తోందని సమాచారం. పైగా ఈ రోల్ పోషిస్తున్నందుకు గాను రెమ్మ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటోందట రష్మీ. దీంతో ఈ వెబ్ సిరీస్ సంగతులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

గతంలో కియారా.. ఇప్పుడు రష్మీ..

గతంలో కియారా.. ఇప్పుడు రష్మీ..

వెబ్ సిరీస్ లకు సెన్సార్‌ సమస్యలు లేకపోవడంతో.. కథను ఎలాగైతే ప్రెజెంట్ చేయనుంకుంటున్నారో యధాతథంగా అదే తెరకెక్కించేందుకు ఆస్కారం ఉంది. అందుకే ఎక్కువమంది దర్శకులు, నటీ నటులు వెబ్‌సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గతంలో కియారా ఈ రకమైన అడుగు వేయగా ప్రస్తుతం రష్మీ గౌతమ్ అదే వైపుగా పయనిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X