పెళ్లిపై రష్మిక మందన్న పోస్ట్? క్లారిటీ ఇచ్చేసిన శ్రీవల్లి
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. గతంలో నుంచే రష్మిక మందన్న తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోందని కూడా అన్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటి రూమర్లను రష్మిక మందన్న కన్పమ్ చేయలేదు. అలాగని ఖండించనూ లేదు. అలా సస్పెన్స్ లోనే పెట్టింది. అయితే తాజాగా తను పంచుకున్న ఫొటోలతో మరోసారి తన పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. త్వరలోనే రష్మిక మందన్న పెళ్లి అంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్లితే...
స్టార్ హీరోతో రష్మిక మందన్న రిలేషన్ షిప్?
నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న తన అభిమానులను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం కెరీయర్ పరంగా హైప్ లో ఉంది. మరోవైపు తన వ్యక్తిగత విషయంలోనూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన రూమర్లపై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ తన సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా మాత్రం రష్మిక మందన్న హిట్ ఇస్తుందని అంటున్నారు. ఇక రష్మిక మందన్న కొన్నాళ్లుగా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ లో ఉందని పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈసారి ఇలా హింట్ ఇచ్చిన శ్రీవల్లి..
ప్రతి సారి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల మధ్య రిలేషన్ షిప్ ఉందంటూ, వారిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతోంది. ప్రచారం అంటే ఏదో ఊరికే పుకారు పుట్టించడం కాకుండా.. ఆధారాలను చూపిస్తూ మరీ వారి రిలేషన్ షిప్ పై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని అనుకుంటున్నారు. రష్మిక మందన్న బర్త్ డే ఫొటోస్, గతంలోని మాల్దీవ్స్ ఫొటోస్, అంతకు ముందు హోటల్స్, ఫెస్టివల్స్ కు సంబంధించిన ఫొటోలు వీరి రిలేషన్ ను అనాధికారికంగా పరోక్షంగా తెలుపుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక మందన్న పంచుకున్న ఫొటోలు ఆసక్తికరంగా మారాయి. తను పంచుకున్న తాజాగా ఫొటోలో బ్యాక్ గ్రౌండ్ ను బట్టి రష్మిక, విజయ్ ఇంట్లోనే ఉందని అంటున్నారు.
కొన్నాళ్లు సాగుతున్నా.. ఎందుకు సస్పెన్స్..
రష్మిక మందన్న గానీ, విజయ్ దేవరకొండ గానీ తమ రిలేషన్ షిప్ పై వస్తున్న రూమర్లను ఏమాత్రం ఖండించడం లేదు. దీంతో మౌనమూ అంగీకారమే అన్నట్టుగా వారి సైలెన్స్ తో పుకార్లను మరింత బలంగా నమ్ముతున్నారు. ఇక తాజాగా పంచుకున్న ఫొటోస్ తర్వాత త్వరలోనే రష్మిక, విజయ్ తమ పెళ్లి వార్తపై అప్డేట్ ఇవ్వబోతున్నారని చర్చించుకుంటున్నారు.
రష్మిక మందన్న ఇలా.. విజయ్ అలా..
వరుస విజయాలతో రష్మిక మందన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారుతోంది. యానిమల్, పుష్ప 2, ఛావా వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు విజయ్ దేవకొండ అర్జున్ రెడ్డి తరహాలో మరోసారి బ్లాక్ బ్లాస్టర్ అందుకోవాలని ఆలోచిస్తున్నారు. నెక్ట్స్ వచ్చే 'కింగ్డమ్' సినిమాపై బలమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











