రౌడీ హీరోతో స్టార్ హీరోయిన్ రొమాన్స్ ..? ఇక బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్..
విజయ్ దేవరకొండ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అతి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ. కెరీర్ ప్రారంభంలో చిన్నచిన్న క్యారెక్టర్ చేశారు. ఈ సమయంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో అవకాశాన్నిసద్వినియోగం చేసుకున్నాడు. దీంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తిరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో నటించి రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయారు విజయ్. ఈ సినిమాతో
విజయ్ కెరీర్ ను మలుపు తిరిగింది. ఇలా స్టార్ డమ్ తెంచుకున్న విజయ్ కు ఇటీవల వరుస ఫ్లాప్లులు ఎదురవుతున్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్పై థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులకు రాబోతున్నారు. అయితే.. అందులో ఓ స్టార్ బ్యూటీ తో నటించబోతున్నారట?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా చివరి స్టేజ్‌కి చేరుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ మూవీ పూర్తి కాగానే.. రౌడీ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. అదే.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారట. అయితే..ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఏ హీరోయిన్ రొమాన్స్ చేయబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటించబోతున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ, ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చెక్కలు కొడుతుంది.
ఇక ఈ వార్త విన్న అటు విజయ ఫ్యాన్స్, రష్మిక మందాన డైట్ ఫాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇప్పటికే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ భారీ ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇన్ డైరెక్ట్ గా తామిద్దరం రిలేషన్ లో ఉన్నామంటూ రష్మిక మందాన ఇప్పటికీ వెల్లడించిన విషయం తెలిసింది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ రష్మిక మందాన తో డేటింగ్ రూమర్స్ పై స్పందించారు.

సమయం వచ్చినప్పుడు తానే ఓపెన్ అవుతానని, ఈ ఈ విషయంపై చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో రష్మిక మందాన- విజయ్ దేవరకొండ లు మరోసారి జతకట్టబోతున్నారని, ఈ హిట్ పెయిర్ మళ్లీ జతకడితే ఈ సారి బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించేంతవరకు ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.


Click it and Unblock the Notifications











