మెగా మల్టీస్టారర్‌లో రశ్మిక మందన్న.. నిజంగానే బంపర్ ఆఫర్!
ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మీక మందన్న ఆ సినిమా చేయడానికి ఏ క్షణాన ఒప్పుకుందో గాని అదృష్టం మాత్రం అప్పటి నుంచే మొదలైనట్లు తెలుస్తోంది. ఈ మధ్య వరుస విజయాలు అందడమే కాకుండా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చేలా చేసుకుంటోంది. రష్మీక చేతిలో పాన్ ఇండియా సినిమాలతో పాటు మల్టీస్టారర్ సినిమాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఈ కన్నడ బ్యూటీ అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బిగ్గెస్ట్ మెగా మల్టీస్టారర్ లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో చరణ్ కి జోడిగా ఈ బ్యూటీ నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే రష్మీక పూజా హెగ్డేను డామినేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. దీంతో సక్సెస్ లో ఉన్న హాట్ హీరోయిన్ పూజా హెగ్డే ఎవరికి అవకాశాలు రాకుండా అన్ని తనే కొట్టేస్తోంది. ఇక ఆమెకు రష్మీక మందన్న నుంచి గట్టి పోటీ అందుతోంది. స్టార్ హీరోలు కూడా రష్మీక వైపు ఎక్కువగా చూస్తున్నారు. ఇటీవల చరణ్ కి జోడిగా సెట్ చేసేందుకు చాలా మంది హీరోయిన్స్ ని చూసిన దర్శకుడు కొరటాల శివ ఫైనల్ గా రష్మీకను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











