రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. కాక్ టైల్ 2 కోసం నేషనల్ క్రష్ పారితోషికం ఎన్ని కోట్లంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్‌లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇప్పుడు భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ 'కాక్‌టైల్ 2'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్ కృతి సనన్‌తో కలిసి రష్మిక మందన్నా నటించారు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

2012లో విడుదలైన 'కాక్‌టైల్' అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుంది. సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ, స్నేహం, భావోద్వేగాల చుట్టూ తిరిగే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ఫ్రాంచైజీలో భాగంగా దర్శకుడు హోమీ అదజానియా 'కాక్‌టైల్ 2'ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రీమేక్ కూడా కాదు. కేవలం 'కాక్‌టైల్' తరహా భావోద్వేగాలు, ప్రేమ, స్నేహంతో కూడిన కొత్త కథ అని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు.

Rashmika Mandanna Charges Rs 15 Crore for Cocktail 2 Continues Bollywood Domination

ఈ సినిమాలో షాహిద్ కపూర్‌తో పాటు కృతి సనన్, రష్మిక మందన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.ముఖ్యంగా రష్మిక పాత్రపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. పుష్ప, పుష్ప 2, యానిమల్ వంటి సినిమాలో పాన్ ఇండియా మార్కెట్ ను సొంతం చేసుకుంది. తాజాగా బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక ఈ సినిమాలో'దియా' అనే పాత్రలో కనిపించనుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన రెమ్యునరేషన్ వివరాలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన షాహిద్ కపూర్ రూ.35 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు కృతి సనన్ రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక రష్మిక మందన్నా కూడా రెమ్యూనరేషన్ పెంచేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రూ. 15 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి బాలీవుడ్ లో కూడా రష్మిక మార్కెట్ పెరిగినట్టు తెలుస్తోంది.

'పుష్ప', 'యానిమల్', 'ఛావా' వంటి భారీ విజయాల తర్వాత రష్మికకు దేశవ్యాప్తంగా క్రేజ్ మరింత పెరిగింది. నిర్మాతలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. అందుకే 'కాక్‌టైల్ 2' నిర్మాతలు కూడా ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌ల జాబితాలో రష్మిక పేరు ముందు వరుసలో వినిపిస్తోంది.

ఇప్పటికే 'జబ్ తలక్', 'మషూకా', 'తుఝ్కో' అనే మూడు పాటల ద్వారా పాత్రలను పరిచయం చేసిన మేకర్స్.. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ముఖ్యంగా షాహిద్-రష్మిక జంటపై తెరకెక్కిన 'తుఝ్కో' పాటకు మంచి స్పందన లభించింది. 'కాక్‌టైల్ 2' జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన ఈ చిత్రంతో రష్మిక మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ రష్మిక మందన్నా క్రేజ్ మామూలుగా లేదని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X