Rashmika: రణబీర్ కపూర్‌తో రష్మిక లిప్ లాక్స్... వామ్మో ఒక్కో ముద్దు సీన్ కోసం అంత ఛార్జ్ చేసిందా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ.. తెలుగు, తమిళ్ లోనే కాదు.. హిందీలోనూ టాప్ హీరోయిన్ గా క్రేజ్ కొట్టేస్తోంది. తాజాగా ఈ భామ బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో కలిసి రొమాన్స్ చేస్తోంది. సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ బ్యూటీ ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ పై విపరీతంగా ట్రోల్స్, విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ భామ ఈ సినిమాలో ఒక్కో లిప్ లాక్ సీన్ కోసం ఎంత ఛార్జ్ చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రష్మిక మందన్నా ఇటీవల కాలంలో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇటు టాలీవుడ్ లో వరుస సినిమాలు తన చేతిలో ఉండగా... అటు కోలీవుడ్ లోనూ సినిమాలు చేతిలో ఉన్నాయి. మరోవైపు హిందీలోనూ తన సత్తా చాటేందుకు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగా... అదే సినిమాను మళ్లీ కబీర్ సింగ్ అంటూ బాలీవుడ్ లో మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ఇక సందీప్ వంగా నెక్ట్స్ ప్రాజెక్ట్ యానిమల్. ఈ సినిమా అర్జున్ రెడ్డి సినిమాకు వంద రెట్లు ఉంటుందని అంతకు ముందే ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా... ఆయన సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్ ఆకట్టుకుంటుంన్నాయి. ముక్యంగా ఇటీవల రిలీజ్ అయిన పాటపై పలు విమర్శలు, ట్రోలింగ్ అయితే వస్తుంది.

దానికి కారణం అందులో రణబీర్ కపూర్, రష్మిక రొమాన్స్. ఫ్యామిలీ ముందే రష్మిక, రణబీర్ లీప్ లాక్ సీన్స్... పాటలో మొత్తం లీప్ లాక్ సీన్స్ ఉండటం... ట్రోలింగ్ కు గురవుతుంది. మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. మరీ ఇంతలా రెచ్చిపోయి... నటించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే ఈ లిప్ లాక్ సీన్స్ కోసం... రష్మిక బాగానే ఛార్జ్ చేస్తుందని తెలుస్తోంది. భారీ మొత్తంలో వసూలు చేస్తుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
రష్మిక.. రణబీర్ కపూర్ తో కలిసి బోల్డ్ గా ఈ సినిమాలో నటించదని తెలుస్తోంది. అయితే ఒక్కో లిప్ లాక్ సీన్ కోసం ఈ బ్యూటీకి నిర్మాతలు భారీగానే డబ్బులు ఇచ్చారట. ఒక్క లిప్ లాక్ సీన్ కోసం రష్మిక... 20 లక్షల రూపాయలు వసూలు చేసిందని తెలుస్తోంది. అలా ఈ సినిమాలో ఎన్ని లిప్ లాక్ సీన్స్ ఉంటే.. అదనంగా అన్ని 20 లక్షల రూపాయలు వసూలు చేసిందని సోషల్ మీడియాలో ఓవార్త హల్ చల్ చేస్తుంది. ఈ లెక్కన రష్మిక బాగానే వెనకేసుకుందని నెటిజన్స్ అంటున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... యానిమల్ సినిమాకు సందీప్ వంగా రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హీందీ భాషల్లో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











