Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఆ మాత్రం ఇచ్చుకుంటేనే తన వైపు చూడాలంటున్న రష్మిక.. స్టార్ హీరోయిన్ రేంజ్లో!
కన్నడ భామ రష్మిక మందన్న క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఛలో అంటూ సినీ గడప తొక్కిన ఈ భామకు వరుస అవకాశాలు వస్తుండటంతో తన డిమాండ్ పెంచేసిందట రష్మిక. స్టార్ హీరోయిన్ స్థాయిలో రెమ్మ్యూనరేషన్ ఇస్తేనే ఓకే. లేదంటే తన వైపు కూడా చూడొద్దంటుందట ఈ అమ్మడు. అయినా కూడా ఈమెను వదులుకునేందుకు సిద్ధంగా లేరట దర్శక నిర్మాతలు. ఎంతైనా ఇస్తాం.. కానీ రష్మికనే కావాలి.. అన్నట్లుగా ఉందట తాజా పరిస్థితి.
ఛలో, గీతగోవిందం సినిమాలకు గాను కేవలం 10 నుంచి 20 లక్షలు తీసుకున్న ఈ భామ.. గీతగోవిందం హిట్ టాక్ రాగానే దానిని డబుల్ చేసేసిందట. అయినా కూడా వరుస అవకాశాలు తలుపు తడుతుండటంతో ఆ రేంజ్ మరింత పెంచేసి ఏకంగా కోటి డిమాండ్ చేస్తోందట రష్మిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రస్తుతం ఈ అమ్మడి హవానే నడుస్తోంది.
విజయ్ దేవరకొండతో క్రేజీ జోడీగా పేరు తెచ్చుకున్న ఈమె మరికొద్ది రోజుల్లోనే డియర్ కామ్రేడ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు 26 వ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది. ఈ లోగా తమిళ్ లో హీరో విజయ్ తో రొమాన్స్ చేసే అవకాశం ఈమె తలుపుతట్టింది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న స్టైల్ లో రష్మిక డిమాండ్ ఓ రేంజ్ లో చేస్తుందట. తాను చిన్న, పెద్ద హీరోలెవరైనా నటిస్తా కానీ తనకు కోటి రూపాయలు కావాల్సిందేనని పట్టు బతుకు కూర్చుంటుందట రష్మిక. అమ్మడి వాలకం చూస్తుంటే మరో కొన్ని సినిమాలు పూర్తికాగానే మరో కోటి పెంచేస్తా అంట్లుందిగా! అని జనం చెప్పుకుంటున్నారు.