రష్మిక ఎంత చెప్పినా వినడం లేదు.. మళ్ళీ అదే రిపీట్! హాట్ ఇష్యూ
తెలుగు చిత్రసీమలో కన్నడ భామ రష్మిక మందన్న మంచి జోష్‌లో ఉంది. అనతి కాలంలోనే అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకొని, వరుస సినిమాలతో బిజీ అయింది. ఛలో అంటూ టాలీవుడ్ గడప తొక్కిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటిస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే.. ఇక ఆమెను ఢీకొట్టే హీరోయిన్ ఇప్పట్లో కనిపించదేమో అంటున్నారు ప్రేక్షకులు

నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ..
ఈ నేపథ్యంలోనే తన క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ రష్మిక, తన వద్దకు వచ్చిన దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందని టాక్ వచ్చింది. తాను హీరోయిన్ గా చేయాలంటే కనీసం 3 నుంచి 4 కోట్ల మేర సమర్పించుకోవాల్సిందే అంటోందట. రష్మిక డిమాండ్ పెద్దదే అయినప్పటికీ, ఆమె కోసం అంత మొత్తం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట ఫిలిం మేకర్స్.

కేర్ లెస్‌గా రష్మిక.. అయినప్పటికీ!
ఉన్నట్టుండి తన క్రేజ్ అమాంతం పెరిగిపోవడం వల్ల రష్మిక తీరులో మార్పు వచ్చిందని, ఆమె చాలా కేర్ లెస్‌గా వ్యవహరిస్తోందని, పారితోషికం కూడా బాగా పెంచేసి అలా అయితేనే సినిమాకు ఓకే చెబుతా అంటోందనే టాక్ ముదిరింది. దీంతో ఈ విషయమై రష్మిక క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయినప్పటికీ ఆమెపై వస్తున్న రూమర్స్ ఆగడం లేదు. రష్మిక మాటలు ఎవ్వరూ వినడం లేదు.

నాగ చైతన్యను మించి పోతోంది
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. మరికొద్ది రోజుల్లో అక్కినేని వారబ్బాయి నాగచైతన్యతో నటించనుంది. అయితే ఈ సినిమాకు గాను రష్మిక 5 కోట్లు డిమాండ్ చేస్తోందనే టాక్ బయటకు వచ్చింది. బేసికల్ గా నాగచైతన్య రెమ్మ్యూనరేషన్ కంటే ఈ ఫిగర్ ఎక్కువే. దీంతో ఇది చూసి.. చైతూ కంటే రష్మికకు ఎక్కువ ఇచ్చే ప్రసక్తే లేదు. ఇదంతా ఎవరో కావాలనే పుట్టిస్తున్నారని అంటున్నారు ఆమె సన్నిహితులు.

ఆర్మీ ఆఫీసర్‌తో రష్మిక..
మరోవైపు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తోంది రష్మిక. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్.. ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇందులో రష్మిక రోల్ చాలా కీలకం కానుందని సమాచారం. జనవరి 12 న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











