Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షాకిస్తున్న రష్మిక మందన్న.. అలా అయితేనే ఓకే లేదంటే కుదరదు
ప్రస్తుతం యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న జోరు చూస్తుంటే.. ఇక ఆమెను ఢీకొట్టే హీరోయిన్ ఇప్పట్లో కనిపించదేమో అంటున్నారు ప్రేక్షకులు. 'ఛలో' అంటూ టాలీవుడ్ గడప తొక్కిన ఈ కన్నడ భామ వరుస సినిమాలతో బిజీ అయింది. కెరీర్లో ఎక్కడా వెనుతిరిగి చూసిందేలేదు. మొదటి సినిమాను చిన్న హీరో నాగశౌర్యతో చేసిన రష్మిక.. ఆ తర్వాత మీడియం రేంజ్ హీరో విజయ్ దేవరకొండతో జోడీ కట్టి 'గీత గోవిందం' రూపంలో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె చేసిన రొమాన్స్, అదేవిధంగా సన్నివేశాలకు తగ్గట్లుగా చూపిన అభినయం అగ్ర దర్శకులు, అగ్ర హీరోల దృష్టిలో పడింది. వెంటనే ఆమెకు అవకాశాల పంట పండింది.
ఈ నేపథ్యంలో రష్మిక మందన్న డిమాండ్ కూడా బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. జెట్ స్పీడ్ లో కెరీర్ గ్రాఫ్ దూసుకుపోతోంది కాబట్టి ఇప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని డిసైడ్ అయిందట రష్మిక. ఈ మేరకు తన కొత్త సినిమాలకు కోటికి పైగా రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట రష్మిక మందన్న. అంతిస్తేనే ఓకే చెప్తానని, లేదంటే కుదరదని నిర్మొహమాటంగా చెప్పేస్తోందట ఈ కన్నడ భామ. దీంతో అనతికాలంలోనే అమ్మడి డిమాండ్ చూసి షాకవుతున్నారట దర్శకనిర్మాతలు.
ఇక రష్మిక మందన్న లేటెస్ట్ సినిమాల విషయానికొస్తే.. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన 'డియర్ కామ్రేడ్' సినిమాలో మరోసారి విజయ్ దేవరకొండతో లిప్‌లాక్స్ చేసింది రష్మిక. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు కమిట్ అయింది రష్మిక మందన్న. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న 'సరిలేరు నీకెవ్వరు' మరో రెండు మూడు రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.